శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (08:54 IST)

బాలాజీ డివిజన్‌ ఇప్పట్లో అవకాశం లేదు: దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌

‘తిరుపతి బాలాజీ డివిజన్‌ ఏర్పాటుకు ఆర్థిక భారంతో ముడిపడి ఉంది. అందువల్ల ఇప్పట్లో ఇవి మంజూరయ్యే అవకాశం లేదు’ అని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ (జీఎం) గజానన్‌ మాల్యా పేర్కొన్నారు.

కరోనా కారణంగా గూడూరు-బొమ్మసముద్రం సెక్షన్‌లో పర్యటించడానికి కొంత జాప్యమేర్పడిందని చెప్పారు. ఈ సెక్షన్‌లో రైలు మార్గాల సామర్థ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించామన్నారు. అలాగే అండర్‌బ్రిడ్జి నిర్మాణాలు, ఎలక్ర్టానిక్‌, ఎలక్ర్టికల్‌ సిస్టమ్‌ ద్వారా జరుగుతున్న రైళ్ల నిర్వహణను గమనించానన్నారు.

ఖర్చులు తగ్గించుకోవడం, ఆదాయాలు పెంచుకోవడం పైనే రైల్వేబోర్డు దృష్టి సారించిందని వెల్లడించారు. కాగా.. చంద్రగిరి స్టేషన్‌లో మాత్రమే మహిళా ఉద్యోగులతో రైళ్ల రాకపోకలు నిర్వహిస్తున్నామన్నారు. గూడూరు-వెంకటగిరి మధ్య ఉన్న పలు రైల్వేబ్రిడ్జిల నాణ్యత ప్రమాణాలు, రైలు మార్గాల పటిష్ఠతను పరిశీలించామన్నారు.