శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 3 డిశెంబరు 2020 (06:35 IST)

ఈ ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే అత్యుత్తమ లోడింగ్

దక్షిణ మధ్య రైల్వేలో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 2020`21లో సరుకు లోడింగ్ లో వరుసగా అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంది. నవంబర్‌ 2019 నెలో నమోదైన 8.9 మిలియన్‌ టన్ను సరుకు లోడింగ్ తో పోలిస్తే నవంబర్‌ 2020 నెలో 9.3 మిలియన్‌ టన్ను లోడింగ్ నమోదయ్యింది.

కోవిడ్‌`19 అననుకూ పరిస్థితు నెకొని ఉన్నప్పటికీ, దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజరు గజానన్‌ మార్గదర్శకత్వం మరియు నాయకత్వంలో జోన్‌లోని ద.మ.రైల్వే బృందం నిరంతర కృషి కారణంగా సకారాత్మక వృద్ధిని నమోదు చేసుకుంది.

బొగ్గు లోడింగ్ లో తగ్గింపు నమోదు అయినప్పటికీ, ఇతర సరుకున్నింటి లోడింగ్ లో పెంపుదల  కారణంగా సరుకు లోడింగ్ లో పెంపుదల నమోదవుతోంది. గత సంవత్సరంతో పోలిస్తే వ్యవసాయ ఉత్పత్తు లోడింగ్ లో ఆహారధాన్యాుల  మరియు ఎరువు లోడింగ్ 25% ఎక్కువగా (0.64 మి.టన్ను) మరియు 44% ఎక్కువగా (0.62 మి.టన్ను)గా నమోదయ్యింది.

దక్షిణ మధ్య రైల్వే బృందా నిరంతర కృషి కారణంగా, సిమెంట్‌ మరియు కంటెయినర్ల లోడింగ్ కూడా పెంపుదను నమోదు చేసుకున్నాయి. గత సంవత్సరం నవంబర్‌ తో పోలిస్తే కంటెయినర్‌ లోడింగ్ 67% అధికంగా 0.152 మిలియన్‌ టన్నుగా నమోదయ్యింది.

ఇక, గత సంవత్సరం ఇదే నె (1.9 మిలియన్‌ టన్ను)తో పోలిస్తే సిమెంట్‌ లోడింగ్ 50% పెరిగి ఈ సంవత్సరంలో 2.84 మిలియన్‌ టన్నుగా నమోదయ్యింది. రైల్వేలో పు టారిఫ్‌ మరియు నాన్‌`టారిఫ్‌ ప్రణాళికాబద్ధమైన చర్యను చేపట్టడంతో జోన్‌లో సరుకు లోడిరగ్‌లో గణనీయ వృద్ధి సాధ్యపడిరది.

ఇదే సమయంలో జోనల్‌ మరియు డివిజనల్‌ స్థాయిలో బిజినెస్‌ డెవప్‌మెంట్‌ యూనిట్ల ఏర్పాటు సరుకు లోడిరగ్‌ పెంపుకు మార్గం వేయడమే కాకుండా ప్రస్తుతమున్న సరుకుకు తోడుగా సరిక్రొత్త లోడింగ్ ను ఆకర్షించడం సాధ్యపడిరది.

సరుకు రవాణా రైళ్ళ రాకపోకకు తగు ప్రాధాన్యతను ఇవ్వడం మరియు అన్ని స్థాయిల్లో పర్యవేక్షించడం జరిగింది. సరుకు రవాణా రైళ్ళ సగటు వేగం గత సంవత్సరం నవంబరు నెలో గంటకు 27 కిలోమీటర్లతో పోలిస్తే ఈ సంవత్సరం నవంబరు నెలో 85% వృద్ధితో గంటకు 50 కిలోమీటర్లుగా నమోదయ్యింది.

దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజరు గజానన్‌ మ్యా జోన్‌ పై ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షిస్తూ అన్ని విభాగాతో సమీక్షా సమావేశాను నిర్వహిస్తూ సమన్వయపరచడం జరిగింది. రానున్న మిగతా ఆర్థిక సంవత్సరంలో కూడా ఇదే తరహా పెంపును కొనసాగించాని ఆయన రైల్వే సిబ్బందికి సూచించారు.