శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 23 నవంబరు 2020 (07:35 IST)

దక్షిణమధ్య రైల్వే జోన్ మీదుగా మరో 8 ప్రత్యేక రైళ్లు

దక్షిణమధ్య రైల్వే జోన్ మీదుగా మరో 8 ప్రత్యేక రైళ్లు ప్రయాణించనున్నాయని అధికారులు తెలిపారు. కోవిడ్- 19 సెకండ్ వేవ్ ప్రారంభమయిన నేపథ్యంలో, ప్రయాణికులు ఎక్కువగా లేని సుమారు 12 రైళ్లను దక్షిణమధ్య రైల్వే రద్దు చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో జోన్ పరిధిలో కొన్ని చోట్ల ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మరో 8 ప్రత్యేక రైళ్లు జోన్ పరిధిలో ప్రయాణించనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ నెల 24వ తేదీన చెన్నై టు న్యూఢిల్లీ రైలు జోన్ పరిధిలోని విజయవాడ, వరంగల్ స్టేషన్‌లలో ఆగుతుంది.

22వ తేదీన చెన్నై టు అహ్మదాబాద్, 23వ తేదీన అహ్మదాబాద్ టు చెన్నై రైళ్లు ప్రతిరోజు జోన్ పరిధిలో నడుస్తాయని అధికారులు తెలిపారు. సిర్పూర్ కాగజ్‌నగర్, మంచిర్యాల, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, సూళ్లూరుపేట మీదుగా ఈ రైళ్లు ప్రయాణించనున్నాయి.
 
వీటితో పాటు ఈనెల 25వ తేదీన కన్యాకుమారి టు నిజాముద్దీన్ రైలు ప్రారంభమై ప్రతి బుధ, శుక్రవారాల్లో నడవనుండగా, 28వ తేదీన నిజాముద్దీన్ టు కన్యాకుమారి శని, సోమవారాల్లో ప్రయాణికులకు సేవలందించనున్నాయి.

ఈ రైళ్లకు విజయవాడలో స్టాప్ ఉంటుందని అధికారులు తెలిపారు. 23వ తేదీ నుంచి ఎర్నాకుళం టు పాట్నా (ప్రతి సోమ, మంగళవారంలో), 26వ తేదీ నుంచి పాట్నా టు ఎర్నాకుళం (ప్రతి గురు, శుక్రవారాల్లో) జోన్ మీదుగా ప్రయాణించనున్నాయి. ఈ రైళ్లు ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస స్టేషన్‌లలో ఆగుతాయని దక్షిణమధ్య రైల్వే తెలిపింది.