1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. More special trains for Dussehra

దసరా పండగకు మరిన్ని ప్రత్యేక రైళ్లు

special trains
దసరా పండగ దృష్ట్యా పలు ప్రాంతాలకు మరిన్ని ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాకినాడ-లింగంపల్లి, తిరుపతి-లింగంపల్లి, నర్సాపూర్‌-లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ద.మ.రైల్వే తెలిపింది.

వాటితో పాటు విజయవాడ-హుబ్లీ, తిరుపతి-అమరావతి మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈప్రత్యేక రైళ్లు అన్నీ 20వ తేదీ నుంచి మొదలుకొని 30వరకు తిరగనున్నాయని ద.మ.రైల్వే వివరించింది. 
 
వివరాలు ఇలా... 
* కాకినాడ పోర్టు- లింగంపల్లి: ఈనెల 20 నుంచి ప్రతిరోజూ రా.7:10గం.కు
* లింగంపల్లి- కాకినాడ: ఈనెల 20 నుంచి ప్రతిరోజూ రా.8:30గం.కు
* తిరుపతి- లింగంపల్లి: ఈనెల 20 నుంచి ప్రతిరోజూ ఉ.6:55గం.కు
* లింగంపల్లి- తిరుపతి: ఈనెల 20 నుంచి ప్రతిరోజూ సా.5:30గం.కు
* నర్సాపూర్‌- లింగంపల్లి: ఈనెల 23 నుంచి ప్రతిరోజూ సా.6:55గం.కు
* లింగంపల్లి- నర్సాపూర్‌: ఈనెల 20 నుంచి ప్రతిరోజూ రా.9:05గం.కు
* విజయవాడ- హుబ్లీ: ఈనెల  21 నుంచి ప్రతిరోజూ రా.7:45గం.కు
* తిరుపతి- అమరావతి: ఈనెల  20 నుంచి ప్రతిరోజూ మ.3:10గం.కు
* అమరావతి- తిరుపతి: ఈనెల22 నుంచి ప్రతిరోజూ ఉ.6:45గం.కు
About Writer
ఎం
తర్వాతి కథనం
మద్య నియంత్రణలో డ్వాక్రా మహిళల భాగస్వామ్యం