శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 29 జూన్ 2020 (19:29 IST)

రేపటి నుంచి ప్రత్యేక రైళ్లలో తత్కాల్‌

ప్రత్యేక రైళ్లలో ప్రయాణికుల రిజర్వేషన్‌ చేసుకునేందుకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ప్రస్తుతం 30 రాజధాని, 200 ఎక్స్‌ప్రెస్, మెయిల్ తరహా రైళ్లను రైల్వేశాఖ నడుపుతోంది.

రేపటి(జూన్‌ 30) నుంచి నడిచే 230 ప్రత్యేక రైళ్లకు తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు అని తెలిపింది. ఎసీ క్లాస్‌కు ఉదయం 10గంటల నుంచి, స్లీపర్ క్లాస్‌కు ఉదయం 11గంటల నుంచి బుకింగ్స్‌ ప్రారంభమవుతాయని రైల్వే అధికారులు వెల్లడించారు.

మే 12 నుంచి 30 ఎసీ స్పెషల్ రైళ్లను.. జూన్ 1 నుంచి 200 మెయిల్, ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైళ్లను రైల్వేశాఖ నడపనున్న విషయం తెలిసిందే.