శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 29 జూన్ 2020 (19:30 IST)

శరద్ పవార్‌కు తృటిలో తప్పిన ప్రమాదం!

ముంబై- పుణె మధ్య ఉన్న ఎక్స్‌ప్రెస్‌వే పై ఎన్సీపీ నేత శరద్ పవార్‌కు త‌ృటిలో రోడ్డు ప్రమాదం తప్పింది. శరద్‌పవార్ కాన్వాయ్‌లోని ఓ వాహనం తొలుత బోల్తా పడింది.

అయితే అప్పటికే శరద్‌పవార్ వాహనం దాటి వెళ్లడంతో ఆయనకు ప్రమాదం తప్పింది. కాన్వాయ్‌లోని ఓ జీపు రోడ్డుపై బోల్తా కొట్టింది.

ఆ జీపులోని డ్రైవర్‌కు స్వల్ప గాయాలైనట్లు పుణే జిల్లా రూరల్ పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.