శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 16 మే 2020 (16:06 IST)

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది వలస కూలీల దుర్మరణం

ఉత్తరప్రదేశ్‌లో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 24 మంది వలస కూలీలు దుర్మరణం పాలయ్యారు. వలస కూలీలతో వెళ్తున్న ట్రక్కును మరో ట్రక్కు వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.

ఔరాయ జాతీయ రహదారిపై ఈ తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వలస కూలీల ట్రక్కు రాజస్థాన్ నుంచి యూపీ వస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో మరో 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.

బాధితుల్లో చాలామంది బీహార్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారు ఉన్నట్టు ఔరాయ జిల్లా కలెక్టర్ అభిషేక్ సింగ్ తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.