ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !
Balayya - Harshali Malhotra
నందమూరి బాలకృష్ణ హీరోగా “అఖండ 2” చిత్రంలో బాల నటిగా ముంబైకు చెందిన హర్షాలి మల్హోత్రా నటిస్తోంది. ఈ పాప సల్మాన్ ఖాన్ నటించిన భజరంగి భాయి జాన్ సినిమాలో నటించింది. ఈ సినిమా కథంతా ఆమె చుట్టూనే తిరుగుతుంది. ముందుగా ఈ పాత్ర కోసం నటి లయ కుమార్తె అనుకున్నారు. ఇందుకోసం షూటింగ్ స్పాట్ కు లయ తన కుమార్తెను తీసుకుని వెళ్ళింది. అయితే దర్శకుడు బోయపాటి శ్రీను కు లయ కుమార్తె శ్లోకా వయస్సు ఎక్కువ కావడంతో సున్నితంగా తిరస్కరించారని తెలిసింది.
హర్షాలి మల్హోత్రా బజరంగీ భాయిజాన్‌లో భారతదేశంలో తప్పిపోయి, ప్రయాణిస్తున్న పాకిస్తానీ ముస్లిం అమ్మాయి షాహిదా (మున్నీ) పాత్రను పోషించింది. ఈమె లుక్ బాగుండడంతోపాటు సెంటిమెంట్ గా ఆ పాపను తీసుకున్నట్లు చిత్ర యూనిట్ సమాచారం. ఆ పాపై కులుమనాలిలో షూటింగ్ చేశారు. తాజాగా కొంత షూటింగ్ గేప్ తీసుకున్నారు. ఈనెల 15 తర్వాత జార్జియా లో షూటింగ్ జరగనుంది. ఇప్పటివరకు డెబ్బై శాతం షూటింగ్ పూర్తయిందని సమాచారం. బోయపాటి శ్రీను అఖండ 2లో సరికొత్త పాయింట్ ను బాలయ్యబాబుతో చెప్పించనున్నారు. జార్జియాలో జూన్ నెల వరకు షూటింగ్ జరగనున్నదని తెలుస్తోంది.