18 నుంచి షార్‌లో కార్యకలాపాలు
లాక్‌డౌన్ కారణంగా షార్‌లో కార్యకలాపాలు ఆపివేసినా గత వారంలో తిరిగి పునఃప్రారంభించారు. అయితే ఆదివారం నుంచి సూళ్లూరుపేటలో కరోనా విజృంభించడంతో సోమవారం నుంచి షార్‌లో కూడా లాక్‌డౌన్‌ను అమలు చేశారు.
ప్రస్తుతం మరలా 18వ తేదీ నుంచి షార్‌లో కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం ముందుగా సూళ్లూరుపేటలో ఉన్న కాలనీలోని ఉద్యోగులకు, పీఈఎల్ కంపెనీ ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహింపచేస్తున్నారు.
ఆ మేరకు కేఆర్‌పీ కాలనీలోని మల్టీపర్పస్‌హాల్‌లోని ఆ ప్రాంత ఉద్యోగులకు పరీక్షలు నిర్వహింపచేశారు. శనివారం డీఆర్‌డీఎల్, డీవోఎస్ కాలనీలలో కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
18వ తేదీ ఉదయం 8.15 గంటలకు షార్‌కు బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఇలా షార్‌లో ముఖ్యమైన విభాగాలలో పనులను పునఃప్రారంభించేందుకు షార్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.