శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 29 జనవరి 2020 (16:36 IST)

#INDvsNZ 3rd T20- రోహిత్ శర్మ అదుర్స్..

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టీ-20లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 23 బంతులలో అర్థ శతకం పూర్తిచేసుకున్నాడు. టీ-20ల్లో గత పది ఇన్నింగ్స్‌ల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమైన రోహిత్ ఈ మ్యాచ్‌లో చెలరేగి ఆడుతున్నాడు. 
 
బెన్నెట్ బౌలింగ్‌లో రోహిత్ వరుసగా 6,6,4,4,6 పరుగులతో రెచ్చిపోయాడు. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా మూడో టీ-20 మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుతో తలపడుతోంది. హామిల్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. 
 
చెలరేగిన రోహిత్- న్యూజిలాండ్ టార్గెట్ 180
న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టీ20లో రోహిత్ శర్మ చెలరేగాడు. 40 బంతుల్లో(3 సిక్సులు,6 ఫోర్లు) 65 రన్స్‌తో విజృంభించాడు. ఇంకా ఈ మ్యాచ్‌లో 65 పరుగులు సాధించడం ద్వారా రోహిత్ శర్మ అన్నీ ఫార్మాట్లలో 10000 పరుగులు సాధించిన భారత బ్యాట్స్‌మెన్‌‍గా రికార్డు సాధించాడు. దీంతో టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. న్యూజిలాండ్ కు 180 పరుగుల టార్గెట్ ఫిక్స్ చేసింది.
 
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్‍‌కు మంచి ఓపెనింగ్ దక్కింది. రోహిత్ శర్మ 65 రన్స్ తో చెలరేగగా మరో ఓపెనర్ రాహుల్ 27 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. తర్వాత వచ్చిన శివమ్ ధూబె 3,వీరాట్ కోహ్లీ 38,శ్రేయాస్ అయ్యార్ 17, మనీష్ పాండే 14(నాటౌట్) ,జడేజా 10(నాటౌట్) చేశారు. దీంతో టీమిండియా 179 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో బెన్నెట్ కు మూడు వికెట్లు, మిచ్చెల్ సన్టర్, గ్రండోమకు తలో ఒక వికెట్ పడ్డాయి.