సంబంధిత వార్తలు
- Pawan Kalyan: నేను టిక్కెట్లు అమ్ముకోవట్లేదు.. పవన్ కల్యాణ్
- Nara Lokesh: రెడ్ బుక్లో కేవలం మూడు పేజీలు మాత్రమే నిండాయి.. నారా లోకేష్
- వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బర్త్ డే.. విమానంలో సర్ ప్రైజ్ ఇచ్చిన వైకాపా నేతలు.. మిథున్ రెడ్డి?
- జగన్‌కు హిందువులంటే లెక్కలేదు.. ఆ మాటలు వింటుంటే.. శ్రీనివాసానంద సరస్వతి
- Jagan: విమానంలో సీరియస్గా కూర్చుని వర్క్ చేస్తోన్న జగన్ - ఫోటో వైరల్
మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేయాలో జగన్‌కు ఓ క్లారిటీ ఉంది... సజ్జల
వైకాపా మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేయాలో తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఓ క్లారిటీ ఉందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లి సమీపంలోని కుంచనపల్లిలో జరిగిన జగన్ పుట్టిన రోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు.
జగన్ తన ఐదేళ్ల పాలనలో ఎంతో మేలు చేయాలో అంత చేశారని మళ్లీ అధికారంలోకి రాగానే చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా ఆయనకు ఓ క్లారిటీ ఉందన్నారు. పైగా, జగన్ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలు మాత్రం ఆయన వెంటే ఉన్నారన్నారు.
ప్రజలకు మేలు చేసేది జగన్ ఒక్కరేనని కోట్లాది మంది నమ్ముతున్నారు. అందుకే తన ఐదేళ్ల పాలనలో అందరికీ మేలు చేశారు. ఏదో ఆశించి ఆయన సహాయం చేయరు. తన వల్ల ప్రజలకు ఎంత మంచి జరుగుతుందనే నిత్యం ఆలోచిస్తారు అని తెలిపారు. ఓదార్పు యాత్ర సమయంలోనూ, కరోనా కష్టకాలంలోనూ జగన్ ప్రజలకు అండగా నిలిచిన తీరును సజ్జల గుర్తుచేశారు.
తమ పార్టీ అధినేత జగన ఏ నాడూ పబ్లిసిటీ కోరుకోలేదన్నారు. పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చి కాలనీలు సృష్టించారని, 17 వైద్య కాలేజీలు, పోర్టులు, హార్బర్లు వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినా ప్రచారం చేసుకోలేదని అన్నారు. పైగా, సీఎం చంద్రబాబు నాయుడు 18 నెలల పాలనలో రూ.2.70 లక్షల కోట్లు అప్పుచేశారని కానీ, ప్రజలకు చేసిదేమీ లేదని సజ్జల ఆరోపించారు.
