1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Dussehra celebrations on Indrakeeladri from October 17

అక్టోబర్ 17 నుంచి ఇంద్రకీలాద్రి పై దసరా మహోత్సవాలు

Dussehra celebrations
అక్టోబర్ 17 నుంచి ఇంద్రకీలాద్రి పై శ్రీ శార్వరి నామ సంవత్సర దసరా మహోత్సవాలు జరుగనున్నాయి.దుర్గమ్మ 9 రోజుల పాటు పది అలంకారాలలో దర్శనమివ్వనున్నారు. 
 
అక్టోబర్ 17వ తేదీన తొలిరోజు శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి గా దర్శనమివ్వనున్నారు. 18న శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా, 19న శ్రీ గాయత్రీ దేవిగా,  20న శ్రీ అన్నపూర్ణాదేవిగా, 21 మూలానక్షత్రం రోజున శ్రీ సరస్వతీ దేవిగా, 22 న శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా, 23 న శ్రీ మహాలక్ష్మీ దేవిగా, 24న శ్రీ దుర్గాదేవి, శ్రీ మహిషా సుర మర్ధనీ దేవిగా రెండు అలంకారాలలో దర్శనమివ్వనున్న దుర్గమ్మ..25 న శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు.

అదే రోజు సాయంత్రం కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల తెప్పోత్సవం జరుగనుంది. కోవిడ్ దృష్ట్యా టైం స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే దసరాలో అమ్మవారి దర్శనానికి అనుమతించే అవకాశం వుంది. 
 
రోజుకు 9 వేలా లేక సంఖ్య పెంచాలా అన్న దానిపై అధికారుల తర్జనభర్జన పడుతున్నారు. గత ఏడాది దసరాలో రోజుకు లక్షపైనే భక్తులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈ ఏడాది కోవిడ్ దృష్ట్యా ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని దుర్గగుడి అధికారులు నిర్ణయించారు. 
About Writer
ఎం
తర్వాతి కథనం
విజయవాడ ఎయిర్‌ పోర్టు నుంచి మరిన్ని విమాన సర్వీసులు