శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం

దసరా ఉత్సవాలకు రండి.. గవర్నర్ కు ఆహ్వానం

దసరా మహోత్సవాలు సందర్భముగా దేవస్థానము నందు అత్యంత వైభవముగా నిర్వహించు శ్రీ అమ్మవారి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు విచ్చేయవలసినదిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను నిర్వాహకులు ఆహ్వానించారు.

గవర్నర్ ని కలిసి ఆహ్వాన పత్రిక, అమ్మవారి ప్రసాదములును అందజేసి ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్ మరియు ఆలయ స్థానాచార్యులు  విష్ణుభట్ల శివప్రసాద శర్మ ఉత్సవములకు ఆహ్వానించారు.