1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : సోమవారం, 16 జూన్ 2025 (15:30 IST)

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Suhas, Shivani Nagaram, Nag Ashwin Clap
Suhas, Shivani Nagaram, Nag Ashwin Clap
సుహాస్ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం నేడు రామానాయుడు స్టూడియో ప్రారంభమైంది. ఈ చిత్రంలో హిలేరియస్ క్యారెక్టర్ పోషించనున్నారు. గతంలో ఆయనతో కలిసి నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్‌ ఫేం శివాని నగరం ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. నరేష్, సుదర్శన్, అన్నపూర్ణమ్మ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. గోపి అచ్చర, బి నరేంద్ర రెడ్డి, త్రిశూల్ విజనరీ స్టూడియోస్ ప్రొడక్షన్ నంబర్ 2 ఈరోజు గ్రాండ్ గా ప్రారంభం- ముహూర్తం షాట్ కు క్లాప్ కొట్టిన విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్
 
కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ వంటి హిట్లతో హీరో సుహాస్ తనదైన ముద్ర వేశారు. ఆయన కొత్త చిత్రానికి డెబ్యు డైరెక్టర్ గోపి అచ్చర దర్శకత్వం వహిస్తున్నారు. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 2గా బి నరేంద్ర రెడ్డి నిర్మించనున్న ఈ చిత్రం ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో కూడిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్. రైటర్ పద్మభూషణ్ తో ప్రశంసలు అందుకున్న షణ్ముక ప్రశాంత్ ఈ చిత్రానికి కథను అందించారు.
 
ఈ చిత్రం ఈరోజు పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా ప్రారంభమైంది. చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో దర్శకుడు నాగ్ అశ్విన్,  హీరో సత్యదేవ్ స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందజేశారు. ముహూర్తం షాట్ కు సత్యదేవ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టారు. వంశీ నందిపాటి ఫస్ట్ షాట్‌కు దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి మహి రెడ్డి పండుగుల సినిమాటోగ్రఫర్ గా, విప్లవ్ నైషదం ఎడిటర్‌గా, ఎ రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. రమణ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.
 ఈ నెల నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది.