డెక్స్ట్రోకార్డియా ఉండే అరుదైన కథతో చిరంజీవి రాబోతోంది
Kiku Yanamala, Kashish Khan
"చిరంజీవి" సినిమా స్నీక్ పీక్ ఎలా ఉందో చూస్తే - చిరంజీవి అనే యువకుడు డెక్స్ట్రోకార్డియా (కుడివైపు గుండె ఉండే అరుదైన పరిస్థితి)తో బాధపడుతుంటాడు. అతన్ని ప్రాణంగా ప్రేమిస్తుంది హీరోయిన్. ఈ జంట సన్నిహితంగా ఉన్న సమయంలో కుడివైపు గుండె కొట్టుకునే చిరంజీవికి సాధారణంగా అందరిలాగే ఎడమవైపుకి గుండె లయను గమనించి ఆశ్చర్యపోతుంది హీరోయిన్, ఈ ట్విస్ట్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. చివరలో గ్రే షేడ్ లో హీరోను చూపించారు. ప్రేక్షకులను ఎంగేజ్ చేసే అన్ని ఎలిమెంట్స్ తో ఈ నెల 28న తెరపైకి రాబోతోంది "చిరంజీవి" సినిమా
నటీనటులు - కికు యనమల, కశిష్ ఖాన్, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ భరత్, వైవా రాఘవ, తదితరులు
