Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్
Rebel Star Prabhas thanks fans
రెబల్ స్టార్ ప్రభాస్ నేడు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్ లోనే వున్నారు. జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటి దగ్గర అభిమానులు సందడి నెలకొంది. పోలీసుల రక్షణ, కంట్రోల్ తో ఇంకా జనాలను నియంత్రిస్తున్నారు. ఈరోజు ఉదయం 10 గంటల తర్వాత నుంచి అభిమానులు తరలివచ్చారు. మద్యాహ్నానికి మరింత ఎక్కువయ్యారు. ఇంటిలోనుంచే ప్రభాస్ వారికి దన్నం పెడుతూ ప్రేమతో ఇంతదూరం వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఫైజీ. సినిమా టైటిల్ కూడా నేడు ప్రకటించారు. అనంతరం సోషల్ మీడియాలో చిన్న గ్లింప్స్ ను విడుదలచేసిన ప్రభాస్.. థ్యాంక్ యూ సోమచ్.. మీ అభిమానానికి. ట్రెమండ్ రెస్పాన్స్ వచ్చింది. అందుకు ప్రతి ఒక్కరినీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మీరు లేకపోతే నేను జీరో..అంటూ కుడిచేతితో సంజ్న చేస్తూ చూపించారు. ఇక తాజాగా ఆయన నటిస్తున్న రాజా సాబ్ సినిమా గురించి కూడా అప్ డేట్ ఇచ్చారు. ఇంకా స్పిరిట్, సలార్ 2 సినిమాలు కూడా లైన్ లో వున్నాయి. స్పిరిట్ సినిమాను ఈనెలఖరున ప్రారంభించనున్నారు. అలాగే అక్టోబర్ 31 బాహుబలి రీ రిలీజ్ ఒకే పార్ట్ గా కూడా విడుదల కాబోతోంది.