మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 డిశెంబరు 2020 (06:09 IST)

ఫ్లైట్‌లో పడకసుఖం కావాలా? డబ్బులిచ్చి కోరుకున్నట్టుగా గడపండి.. ఎయిర్‌హోస్టెస్ ఆఫర్

సమాజంలో డబ్బు సంపాదన కోసం అడ్డదారులు తొక్కేవారి సంఖ్య పెరిగిపోయింది. ఇలాంటి అడ్డదారుల్లో ఒకటి వ్యభిచారం. వ్యభిచార రొంపిలోకి అనేక మంది అమ్మాయిలు దిగుతూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. డబ్బుతో పాటు.. హైటెక్ జీవితానికి అలవాటుపడిన అమ్మాయిలు, మహిళలు ఈ పాడుపనికి పాల్పడుతున్నారు. అయితే, ఈ వ్యభిచారం ఇపుడు భూమిమీదే కాదు... ఏకంగా ఆకాశంలో కూడా సాగుతోంది. విమానంలో ప్రయాణించే మగరాయుళ్లు పడక సుఖం పొందాలంటే తనను సంప్రదించాలంటూ ఓ ఎయిర్‌హోస్టెస్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అంతే.. ఆ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది. ఆ పోస్ట్ పెట్టిన ఎయిర్‌హోస్టెస్ పేరు తెలియకపోయినప్పటికీ ఆమె మాత్రం బ్రిటీష్ ఎయిర్‌వేస్‌లో పని చేస్తున్నట్టు సమాచారం. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 'మీరు విమానంలో శృంగార సుఖాన్ని కోరుకుంటున్నారా? అయితే మీరు నాకు కొంత డబ్బులు చెల్లించండి. మీరు కోరుకున్న విధంగా గడపండి' అంటూ బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన ఓ ఎయిర్‌ హోస్టెస్‌ పెట్టింది. ఇది కాస్త వైరల్ అయింది. దీనిపై బ్రిటీష్‌ ఎయిర్‌వేస్ సంస్థ‌ సోమవారం స్పందించి, విచారణకు ఆదేశించింది. 
 
ప్రస్తుతానికి ఆచూకీ తెలియని సదరు ఎయిర్‌ హోస్టెస్‌ సోషల్‌ మీడియా వేదికగా విమానంలో వ్యభిచరిస్తానంటూ ప్రచారం మొదలుపెట్టింది. ఇందుకోసం పోస్టులు, విమానంలో అభ్యంతరకర స్థితిలో దిగిన తన ఫొటోలను ఉంచింది. తన లోదుస్తులను కూడా అమ్ముతానని ప్రచారం మొదలుపెట్టింది.
 
లోదుస్తుల ధర దాదాపు 2,500 రూపాయలు ఉంటుందని తెలిపింది. ఈ పోస్టులు కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌ కావటంతో ఆదివారం చాలా వరకు పోస్టులను తొలగించింది. అయితే సదరు ఎయిర్‌ హోస్టెస్‌ అభిమానులు కొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.