శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (08:40 IST)

ప్ర‌త్యేక రైళ్ళ ద్వారా‌ ‌మూడు కోట్ల లీట‌ర్ల పాల రవాణా: ద‌క్షిణ మ‌ధ్య రైల్వే

లాక్‌డౌన్ సమయంలో దేశ రాజధాని ఢిల్లీ ప్రజల అవసరాలను తీర్చేందుకు ప్రవేశపెట్టిన దూద్ దురంతో (ప్రత్యేక రైలు) ద్వారా రేణిగుంట నుండి హజ్రత్ నిజాముద్దీన్‌కు ఇప్ప‌టివరకు నిరంతరాయంగా 3 కోట్ల లీటర్ల పాలను సరఫరా చేయడం జరిగింద‌ని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌ గజానన్ మాల్య‌ తెలిపారు.

దేశవ్యాప్తంగా పాల సరఫరాను సమతుల్యం చేయడంలో భాగంగా రేణిగుంట నుండి న్యూఢిల్లీ వరకు పాల రవాణా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ ప్రాముఖ్యతను గుర్తించి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక చొరవ తీసుకుని దూద్ దురంతో ప్రత్యేక పాల రైలును నడపడం జరుగుతోంది. ప్రధానంగా, ఈ రైలు మిగతా రవాణా ఎక్స్ ప్రెస్ రైళ్ళతో సమానంగా రేణిగుంట నుండి హజ్రత్ నిజాముద్దీన్ వరకు గల 2300 కి.మీ. దూరాన్ని కేవలం 34 గంటల సమయంలో చేరుకుంటుంది.

మార్చి 26 నుండి రోజు విడిచి రోజు నడుపుతున్న దూద్ దురంతో రైలుకు లభించిన మంచి ప్రతిస్పందన వల్ల జులై 15 వ‌ర‌కు ప్రతీ రోజు నడుపబడుతోంది. సాధారణంగా దూద్ దురంతో ప్రత్యేక రైలు ఒక్కొక్క ట్యాంకరులో 40వేల లీటర్ల సామర్థ్యాన్ని కలిగిన 06 పాల ట్యాంకర్లతో 240 లక్షల లీటర్ల పూర్తి సామర్థ్యంతో న‌డుస్తున్నాయి.

అందుక‌నుగుణంగా దూద్ దురంతో రైళ్ళ ద్వారా ఇప్పటివరకు మొత్తంగా 3 కోట్ల లీటర్ల పాలను 751 పాల ట్యాంకర్ల ద్వారా 126 ట్రిప్పులలో రవాణా చేయబడినవి. ఈ ప్రత్యేక రైలు ద్వారా పాలను రవాణా చేసేందుకు నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎడి డి బి) యొక్క యూనిట్ ద్వారా చిత్తూరు జిల్లాలోని పరిసర 13,000 గ్రామాలలో గల 3000 పాల సేకరణ కేంద్రాల నుండి పాలు సేకరించబడుతున్నాయి.

రేణిగుంట నుండి దేశ రాజధాని కాచిగూడ మీదుగా చేరుకునే ఈ ప్రత్యేక రైలును రెగ్యులర్ గా నడపడం వలన ఇతర సరుకులను రవాణా చేసే వినియోగదారుల నుండి విశేష స్పందన లభిస్తోంది. రేణిగుంట నుండి పాల రవాణా మాత్రమే కాకుండా, దాదాపుగా 56 పార్సిల్ వ్యాన్లు ఈ రైలుకు జత చేయబడి నిత్యావసర వస్తువులు మరియు చైనా క్లే, హార్డ్ పార్సిళ్లు, మామిడి పండ్లు, కర్బూజా పండ్లు మొనవి రవాణా చేయబడుతున్నాయి.

ఈ రైలు ప్రయాణించే మార్గమధ్యంలో గల ఢిల్లీ, భోపాల్, నాగపూర్ మరియు ఝాన్సీ కాకుండా ఈ మార్గమధ్యంలో లేని జోధ్ పూర్, జైపూర్, రూర్కెలా, అంబాలా మొలుగు ప్రాంతాలలో గల వినియోగదారులకు కూడా రవాణా అందుబాటులోకి తేబడిన దీనికి అదనంగా, కాచిగూడ స్టేషన్లో ఈ రైలును రెగ్యులర్‌గా లోడ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు మొత్తం 191 పార్సిల్ వ్యాన్ల ద్వారా సుమారు 4,039 టన్నుల సరుకు రవాణా చేయబడింది.

ఈ స్టేషను నుండి ప్రధాన సరుకులలో భాగం బల్క్ డ్రగ్స్, సిరప్ క్యాప్, యంత్ర విడిభాగాలు, పేపర్ ఉత్పత్తులు, గుడ్లు, చేపలు నిమ్మకాయలు, విద్యుత్ కెపాసిటర్లు మరియు ఇతర సాధారణ సరుకులు రవాణా చేయబడుచున్నవి. ఈ సరుకులు మార్గమధ్యంలో గల నిజాముద్దీన్, భోపాల్, ఝాన్సీ మరియు మార్గమధ్యంలో లేని టాటానగర్, రూర్కెలా, గోరఖ్పూర్, జైపూర్ మరియు జైపూర్ త‌దిత‌ర స్టేషన్లకు రవాణా చేయబడినవి.

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజరు గజానన్ మాల్యా దేశ అవసరాలకు అనుగుణంగా పాలను ఇతర నిత్యావసర సరుకులను రవాణా చేయడంలో సిబ్బంది మరియు అధికారుల చిత్తశుద్ధిని ప్రశంసించారు. జోన్ ద్వారా మూడు కోట్ల లీటర్ల పాల తరలింపు మరియు పార్థివ్ వ్యాన్ల ద్వారా ఇతర సరుకుల రవాణాలో స్థిరమైన పెరుగుదల పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు.