1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

సగం హెల్మెట్ ధరిస్తున్నారా.? అయితే ఇకపై మీ జేబుకు చిల్లే...

శిరస్త్రాణాం ధరించని వాహనచోదకులపై తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఉక్కుపాదం మోపనున్నారు. ముఖ్యంగా, పేరుకు హెల్మెట్ ధరించామని ఫోజులు కొడుతున్నవారి పట్ల మరింత కఠినంగా వ్యవహరించనున్నారు. సగం హెల్మెట్ ధరించిన వారికి అపరాధం విధించనున్నారు. దీనికి కారణం లేకపోలేదు.
 
సాధారణంగా సగం హెల్మెట్‌ ధరించడం వల్ల ఏదేని ప్రమాదం జరిగినప్పుడు తలకు పూర్తి రక్షణగా ఉండదని హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు.సగం ధరిస్తే.. అది హెల్మెట్‌ ధరించినట్లు కాదు... దీంతో వాహనదారుడు పూర్తి హెల్మెట్‌ ధరించలేదని చలాన వేయనున్నారు. 
 
ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఇది ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. నగరంలో నాన్‌ కాంటాక్టు పద్ధతిలో ఉల్లంఘనలపై నిఘా కొనసాగుతుంది. కెమెరాలతో ఉండే సిబ్బంది, సీసీ కెమెరాలు ఈ ఉల్లంఘనలను గుర్తిస్తాయి. 
 
కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి ఉల్లంఘనలు చేసేవారితో పాటు ఐటీఎంఎస్‌(ఇంటిగ్రేటెడ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌)ప్రాజెక్ట్‌లో ఏర్పాటు చేసిన కెమెరాలు ఈ ఉల్లంఘనలు గుర్తించి.. చాలన్లు జారీ చేస్తున్నాయి. నగర వ్యాప్తంగా పలు కూడళ్లలో ఈ కెమెరాలు ఉన్నాయి. 
 
అంటే.. సగం హెల్మెట్‌తో బయటకు వెళ్తే.. తప్పని సరిగా చలాన్లు జారీ అయ్యే అవకాశముందనే విషయాన్ని వాహనదారులు గుర్తించాలి. నిబంధనల మేరకు పూర్తి హెల్మెట్‌ను ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.