శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వి
Last Modified: మంగళవారం, 10 నవంబరు 2020 (09:58 IST)

ఫోన్ మాట్లాడుతూ 27 అంతస్తుల భవనంపై నుంచి కిందపడ్డ హైదరాబాద్ యువకుడు

కెనడాలో హోటల్ మేనేజ్‌మెంట్ చదువుతున్న హైదరాబాదు యువకుడు ప్రమాదవశాత్తు భవనంపై నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయాడు. వనస్థలిపురం ఫేజ్ 4కు చెందిన పాణ్యం అఖిల్ (19) టోరంటోలో హోటల్ మేనేజ్‌మెంట్ చదువుతున్నాడు. మొదటి సెమిస్టర్ పూర్తి కావడంతో ఈ ఏడాది మార్చి 20న హైదరాబాదు వచ్చాడు.
 
తిరిగి ఈ నెల 5న కెనడా వెళ్లాడు. ఈ నెల 8న తెల్లవారు జామున తను నివాసం ఉంటున్న భవనంలోని 27వ అంతస్తు బాల్కనిలో ఫోన్‌లో మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి ప్రాణాలు కోల్పో యాడు. సమాచారం అందుకున్న స్నేహితులు వెంటనే అఖిల్ కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
 
కుమారుడి మృతదేహాన్ని హైదరాబాదుకు తెప్పించడానికి సాయం చేయాలని కోరుతూ అఖిల్ తల్లిదండ్రులు కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన మంత్రి కేటీఆర్ అఖిల్ మృతదేహాన్ని తీసుకురావడంలో సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు అక్కడ రాయబార కార్యాలయ అధికారులతో కేటీఆర్ మాట్లాడారు.