సంబంధిత వార్తలు
- 'నా ఫ్రెండ్ గోపీచంద్ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు' : ఈల వేసిన ప్రభాస్
- కాకినాడ పద్మప్రియ థియేటర్లో బన్నీ సందడి
- నాకు పదేళ్లలో రాని హిట్ ఇది. ఆయన అభిమానుల దాహం తీర్చిందిః దర్శకుడు సంపత్ నంది
- సీటీమార్ థియేటర్స్‌లో చూసే సినిమా, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు: గోపీచంద్
- వాళ్ల కష్టాలు తెలిసిన తర్వాత బాధేసింది - సీటీమార్ గురించి గోపీచంద్
సారీ చెప్పిన తమన్నా- వెన్నెనొప్పి వున్నా డాన్స్ చేశాడు
Tamanna ph
2019లో సీటీమార్ సినిమాను స్టార్ట్ చేశారు. తర్వాత ప్యాండమిక్ వల్ల చాలా సమస్యలు వచ్చాయి. అన్నీ సమస్యలు తర్వాత ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ కావడం చాలా హ్యాపీగా ఉంది. ఓ బ్లాక్‌బస్టర్ సినిమా తీయాలనే కోరిక ఈ సక్సెస్‌కు కారణం. సంపత్‌గారితో నేను చేసిన మూడో సినిమా. మంచి కథను ఎంటర్‌టైనింగ్‌గా చెప్పే దర్శకుడు సంపత్‌గారు. ఇది మరోసారి ఈ సినిమాతో ప్రూవ్ అయ్యింది. నాకు ఈ సినిమాలో మంచి పాత్ర ఇచ్చినందుకు థాంక్స్. ఈ సినిమాలో 24 మంది హీరోయిన్స్ ఉన్నారు. ఈ మూవీలో కబడ్డీ ఆడిన అమ్మాయిలు ఎంత హార్డ్ వర్క్ చేశారో చూశాను.
ఈ సినిమా కోసం గోపీచంద్ ఎంతో కష్టపడ్డారు. జ్వాలారెడ్డి సాంగ్‌లో వెన్ను నొప్పి ఉన్నా కూడా గోపీచంద్ అద్భుతంగా డాన్స్ చేశారు. నిర్మాతలు శ్రీనివాస్, పవన్‌గారికి థాంక్స్. ప్యాండమిక్ టైమ్ తర్వాత షూటింగ్స్ స్టార్ట్ కావడంతో సినిమా ప్రమోషన్స్‌కు హాజరు కాలేకపోయాను. అందుకు నిర్మాతలకు సారీ చెప్పుకుంటున్నాను. ఈ సినిమా సక్సెస్ నాకెంతో ముఖ్యం. వినాయచవివితో పాటు సీటీమార్ హవా కూడా నడుస్తుంది. అందరూ ఎంజాయ్ చేయండి అన్నారు.
