సీటీమార్ థియేటర్స్‌లో చూసే సినిమా, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు: గోపీచంద్
మా సినిమా ట్రైలర్ చూసి యూనిట్‌కు విషెష్ చెప్పిన మెగాస్టార్ గారికి థాంక్స్. అలాగే నా స్నేహితుడు ప్రభాస్ కూడా ట్రైలర్ చూసి స్పెషల్‌గా ఫోన్ చేసి మాట్లాడాడు. తనకు కూడా థాంక్స్- అంటూ గోపీచంద్ పేర్కొన్నారు. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన భారీ స్పోర్ట్స్ కమర్షియల్ యాక్షన్ డ్రామా సీటీమార్. సెప్టెంబర్ 10న విడుదలవుతున్న ఈ సినిమా ప్రీరిలీజ్ హైదరాబాద్‌లో జరిగింది.
సినిమా విషయానికి వస్తే.. 2019 డిసెంబర్‌లో సీటీమార్‌ను షూటింగ్‌ను స్టార్ట్ చేశాం. యాబై శాతం షూటింగ్ పూర్తయిన తర్వాత కోవిడ్ ఎఫెక్ట్‌తో లాక్‌డౌన్ పెట్టారు. దాదాపు తొమ్మిది నెలలు షూటింగ్‌ను ఆపేశాం. తర్వాత నవంబర్, డిసెంబర్‌లో షూటింగ్‌ను స్టార్ట్ చేసి పూర్తి చేశాం, రిలీజ్‌కు చేద్దాం అనుకుంటున్న తరుణంలో మరోసారి కోవిడ్ ఎఫెక్ట్‌తో సినిమా ఆగింది. ఆ సమయంలో నిర్మాతలను చూసి బాధేసింది. ఇలాంటి పరిస్థితి వస్తే చాలా ఇబ్బందే. గత నెలన్నరగా పరిస్థితులు బెటర్ అవుతున్నాయి. అందరూ బయటకు వస్తున్నారు. సినిమాలు విడుదలవుతున్నాయి. ఇప్పుడు సీటీమార్ వంటి పక్కా మాస్ కమర్షియల్ సినిమా వస్తుంది. ప్రేక్షకులను ఇంటి నుంచి థియేటర్స్‌కు తీసుకొచ్చే సత్తా ఉన్న సినిమా అనే నమ్మకం ఉంది. ఈ సినిమాను ఆదరిస్తే, మిమ్మల్ని అలరించడానికి చాలా చాలా సినిమాలు రెడీగా ఉన్నాయి. మా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి అండ్ టీమ్ ఎక్కువ బడ్జెట్ అవుతుందని నేను చెబితే, కథ నచ్చిందండి చెప్పి సినిమా స్టార్ట్ చేశారు. మణిశర్మగారు అందించిన సాంగ్స్ ఇప్పటికే హిట్. ఇక ఆయన బ్యాగ్రౌండ్ స్కోర్ అందించడంలో కింగ్. ఆయనకు థాంక్స్. తమన్నాకు, నాతో కలిసి నటించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. ఇది థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేసే సినిమా.. తప్పకుండా థియేటర్స్‌కు వచ్చి సినిమా చూడండి. ఎంజాయ్ చేసి ఇంటికెళతారు. అందులో డౌట్ లేదు అన్నారు గోపీచంద్.
స్పోర్ట్స్‌ను ఎంకరేజ్ చేస్తానుః ఎం.పి భరత్
రాజమండ్రి లోక్‌సభ ఎం.పి భరత్ మాట్లాడుతూ, సినిమా గోపీచంద్‌గారి కెరీర్‌లో మైల్‌స్టోన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డైరెక్టర్ సంపత్ నందిగారికి, ఎంటైర్ టీమ్‌కు అభినందనలు. సీటీమార్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న కమర్షియల్ మూవీ అని తెలుసు. ఒలింపిక్స్‌లో మనకు ఏడు మెడల్స్ వచ్చాయి. జనాభాలో మనం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నాం. అయినా మనం టాప్ త్రీలో ఎందుకు ఉండలేకపోతున్నాం. దీనిపై నేను పార్లమెంట్‌లో కూడా మాట్లాడాను. మన నేషనల్ స్పోర్ట్స్ బడ్జెట్ కేవలం రెండు వేల కోట్లు మాత్రమే. అమెరికా, రష్యా వంటి దేశాల్లో మన కంటే యాబై, వంద రెట్ల బడ్జెట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు యూత్ మన రాజకీయాల్లోకి వస్తున్నారు. భవిష్యత్తుల్లో స్పోర్ట్స్‌ను ఎంకరేజ్ చేసి మరిన్ని మెడల్స్ వచ్చేలా చూస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సెకండ్ వేవ్ తర్వాత భారీగా వస్తున్న ఈ సినిమాను చూసి ప్రేక్షకులు ఓ పాత్ సెట్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.
డైరెక్టర్ సంపత్ నంది మాట్లాడుతూ, మన దేశంలో క్రికెట్ తర్వాత ప్రేక్షకులు కోరుకునే ఎంటర్‌టైన్‌మెంట్ ఏదైనా ఉందంటే అది సినిమానే. అలాంటి సినిమా మనకు ఫ్రైడే పండగను తీసుకొస్తుంది. సండే వచ్చిందంటే మనకు సరదాకి సినిమా కెళ్లాలి. అన్నీ మతాలవాళ్లు వెళ్లే ఒకే ఒక గుడి థియేటర్. మన దర్గా అదే.. మన దుర్గమ్మ గుడి అదే.. మన మెదక్ చర్చి అదే. అలాంటి థియేటర్ ఈరోజు కష్టాల్లో ఉంది. ఏడాదిన్నరగా మనకు పాలాభిషేకాలు లేవు, కటౌట్స్ లేవు, పేపర్స్ చించుకోవడాలు లేవు, టిక్కెట్స్ కోసం క్యూ నిలుచుని కొట్టుకోవడాలు లేవు. మళ్లీ సినిమాలు థియేటర్స్‌లో విజృంభించాలి. అది కచ్చితంగా జరుగుతుంది.సీటీమార్ కేవలం స్పోర్ట్స్ సినిమా కాదు.. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న మాస్ కమర్షియల్ మూవీ. సేవ్ సినిమా అన్నారు.
బోయపాటి శ్రీను మాట్లాడుతూ, నిర్మాత శ్రీను ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగానే, లింగుస్వామి దర్శకత్వంలో రామ్ పోతినేనితో మరో సినిమాను స్టార్ట్ చేశాడు. ఆయన అలాగే ముందుకు రావాలి. ఇలాంటి మంచి సినిమాలు తీస్తే ఇండస్ట్రీ బావుంటుంది. ఇండస్ట్రీ బావుంటే అందరం బాగుంటారు. రీసెంట్‌గా జరిగిన ఒలింపిక్స్‌లో సింధు దగ్గర నుంచి చాలా మంది అమ్మాయిలు మన దేశం పేరు నిలబెట్టారు. అమ్మాయిలు ఎందులో తక్కువ కాదు..అధికులు కూడా. వాళ్లు సాధిస్తారు కూడా. అలాంటి అమ్మాయిలపై స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో సినిమా చేసిన శ్రీనుని, డైరెక్టర్ సంపత్‌ని, హీరో గోపీచంద్‌ను అభినందించాలి. గోపీచంద్ పుట్టినప్పటి నుంచి ఫైటరే. తండ్రి టి.కృష్ణగారు నాకు సామాజిక స్పృహ ఉంది. సోసైటీపై నాకొక బాధ్యత ఉంది. ప్రజలను నిద్ర లేపాల్సిన అవసరం ఉంది. అనే సిద్ధాంతాన్ని విడిచి పెట్టకుండా దాన్ని ఫాలో అవుతూ, సినిమాలు చేశారు. అంత గొప్ప మనిషి కొడుకే మన గోపీచంద్. అంతా ఉన్నా కూడా గోపీచంద్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దగ్గర్నుంచి అన్నీ ఒడిదొడుకులే. కానీ గోపీచంద్‌కి మళ్లీ లేస్తాననే నమ్మకం ఉంది అన్నారు.
ఇంకా డైరెక్టర్ లింగుస్వామి, శ్రీవాస్, మారుతి, నిర్మాత కె.కె.రాధామోహన్, ప్రశాంత్ వర్మ, హీరోయిన్ అప్సర రాణి, మంగ్లీ తదితరులు పాల్గొని సీటీమార్ సినిమా పెద్ద సక్సెస్ కావాలని యూనిట్‌కు అభినందనలు తెలిపారు.