శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 16 ఆగస్టు 2021 (08:31 IST)

చేరువైన... దూరమైన సినిమాలో ఆ సీన్‌కు తరుణి సింగ్ ఓకే చెప్పేసింది

cheruvaina duramaina trailer
సుజిత్ రెడ్డి, తరుణి సింగ్ జంటగా వినాయక ఎంటర్టైన్ మెంట్ పతాకంపై చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో కంచర్ల సత్యనారాయణ రెడ్డి, సముద్రాల మహేష్ గౌడ్ కలిసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ’చేరువైన... దూరమైన’. సుకుమార్ పమ్మి సంగీతం అందించారు. ఈ చిత్రం ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరై చిత్ర ట్రైలర్ ను ఆవిష్కరించారు.
 
అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ ‘కమెడియన్ శ్రీనివాసరెడ్డి నాకు ఎంతో ఆప్తమిత్రుడు. ఇండస్ట్రీలో నాకున్న అత్యంత సన్నిహితుల్లో శ్రీనివాస రెడ్డి ఒకరు. నా స్ట్రగుల్స్ లో తోడుగా వున్నారు. నా స్టోరీస్ విషయంలో కూడా ఇన్వాల్వ్ అవుతుంటాడు. 2008 నుంచి కలిసి ప్రయాణం చేస్తున్నాం. అందుకే ఆయన మేనల్లుడి సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వచ్చా. సుజిత్ కి మంచి భవిష్యత్ వుంది. ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. తప్పకుండా ఈ చిత్రం హిట్ అవుతుంది. చిత్ర యూనిట్ కి మంచి భవిష్యత్ వుంటుంది. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకొని ప్రేక్షకులు థియేటర్ కి వస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుందాం. సుజిత్ కి మంచి స్టోరీ తయారుచేసి సినిమా తీయాలని శ్రీనివాసరెడ్డి కోరగా... అలాగే తప్పకుండా చేద్దాం అంటూ నవ్వూతూ’ ముగించారు.
 
చిత్ర దర్శకుడు చంద్రశేఖర్ కానూరి మాట్లాడుతూ, ఓ ఏడాది నుంచి ఈ చిత్రం థియేటర్ కి దూరమవుతూ వచ్చింది. చివరకు ఈ ఆగస్టు 20కి చేరువవుతోంది. ఈ ఏడాదిలో చాలా టెన్షన్ పడ్డాను. చాలా మంది నిర్మాతలు ఈ సినిమాను ఓటీటీకి ఇచ్చేయండి. ఫస్ట్ సేవ్ అవ్వండి అని చెప్పేవారు. కానీ డైరెక్టర్ గా సినిమాను థియేటర్లోనే చూడాలనుకున్నాను. ఈ విషయాన్ని నిర్మాతలకు చెప్పలేను. అలాగని ఓటీటీకి వెళ్లమని చెప్పలేను. అయితే నిర్మాతల నోటి నుంచే నేను విన్నమాట. ఈ సినిమాను థియేటర్లోనే చూద్దాం. చాలా మంది ఎంతో కష్టపడి చేసిన సినిమా ఇది. చాలా మంది జీవితాలు ఆధారపడి వున్నాయి. థియేటర్లోనే సినిమాను రిలీజ్ చేద్దాం అని ప్రొడ్యూసర్స్ చెప్పినప్పుడు చాలా ఆనందం వేసింది. చాలా థ్యాంక్స్. ఈ సినిమాకు రియల్ హీరోస్ నిర్మాతలిద్దరూ. కథను నమ్మి ఎంతో ప్యాషన్ తో సినిమాను తీశారు. 
 
ఈ సినిమాలో ఓ సీన్ వుంటుంది. హీరోనో చెంపదెబ్బ కొట్టాలి హీరోయిన్. అయితే ఈ సీన్ ను నేను చేయను అని హీరోయిన్ చెప్పేసింది. దాంతో చాలా టెన్షన్ పడ్డా. ఎందుకంటే నేను తర్వాత ఓ ముద్దు సీను తీయాలి. మరి చెంపదెబ్బ కొట్టడానికే ఒప్పుకోలేదు. ముద్దు సీనుకు ఒప్పుకుంటుందా? అనే సందేహంతో హీరోయిన్ ను అడిగితే.. తాను వెంటనే ఓకే చెప్పేశారు. మరి చెంపదెబ్బకు.ముద్దు సీనుకు తేడా ఏంటో హీరోయిన్ తరుణిసింగ్ చెప్పాలి. క్లైమాక్స్ సీనును ఎంతో కష్టపడి చేసింది. ఆమె సహకరించకపోతే క్లైమాక్స్ సీను అంతబాగా వచ్చేది కాదు. తప్పకుండా ఈ చిత్రం అందరికీ మంచి పేరు తెస్తుంది’ అన్నారు.
 
నిర్మాత కంచర్ల సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ‘టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా ట్రైలర్ లాంఛ్ చేయడం ఆనందంగా వుంది. ఈ సినిమాను ఓ కుటుంబం సబ్యుల్లాగా ఫీలై అందరూ ఎంతో ఇష్టపడి చేశారు. వైజాగ్, కాకినాడ, భీమిలి, హైదరాబాద్ ఇలా ఏ లొకేషన్ కైనా.. సమయానికి వచ్చి షూటింగ్ చేసి.. సినిమాను కంప్లీట్ చేశారు. దర్శకుడు చంద్రశేఖర్ తాను చెప్పిన కథ ఏదైతో వుందో దానినే తీశారు. ఈ రోజు టీజర్, ట్రైలర్ ను చూస్తే అర్థం అవుతోంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ఇష్టపడతారు. నేను ఇదే టీమ్ తో మరో సినిమాను కూడా నిర్మిస్తా. శ్రీనివాసరెడ్డి అన్న మా వెన్నంటి వుండి ఈసినిమాను ఎంతో ప్రోత్సహించారు. ఆయన కొన్ని సందేహాలు వెలిబుచ్చినా...ఈ సినిమాను దర్శకుడు ఎంతో పట్టుదలతో కంప్లీజ్ చేశారు ’ అన్నారు.
 
హీరోయిన్ తరుణి సింగ్ మాట్లాడుతూ, హీరో సుజిత్ చాలా సపోర్టివ్ గా వుంటారు. చాలా క్యూట్ గాయ్. ఈసినిమా ట్రైలర్ చూస్తుంటే గూస్ బమ్స్ వస్తోంది. థియేటర్లో ఈ సిినమాను చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి’ అన్నారు.
 
హీరో సుజిత్ మాట్లాడుతూ, తరుణి సింగ్ చాలా సపోర్ట్ చేసి నటించారు. టామ్ అండ్ జెర్రీలాగా నటించి కంప్లీట్ చేశాం. శశి కూడా చాలా ప్రోత్సహించారు. క్లైమాక్స్ సీన్ పై చాలా సందిగ్ధం వుండేది. అయితే దాన్ని ఓ ఛాలెంజింగ్ గా తీసుకొని కంప్లీట్ చేశాం. అది తెరమీద చూసినప్పుడు మీరే చెబుతారు. నన్ను ఆశీర్వదించండి. ఈ చిత్రం టీజర్ ను గోపీచంద్ మలినేని లాంఛ్ చేసి ఆశీర్వదించారు. ఇప్పుడు అనిల్ రావిపూడి ట్రైలర్ లాంఛ్ చేశారు. నేను కమెడియన్ శ్రీనివాసరెడ్డి అల్లుడిని అని ఎప్పూడూ ఎక్కడా చెప్పలేదు. ఈ రోజు చెబుతున్నా. ఎందుకుంటే... తను నన్ను సొంతగా ఎదగాలని చెప్పారు. అన్నారు.
 
హీరో మేనమామ, కమెడియన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ‘నా మేనల్లుడిని ఆశీర్వదించండి. ఈ చిత్రంలో సుజిత్ బాగా చేశారు. ముఖ్యంగా ఎంతో కష్టంగా అనిపించిన క్లైమాక్స్ సీన్ కూడా ఎంతో బాగా చేశారు. తప్పకుండా అందిరికీ నచ్చుతుంది. ఈ చిత్ర టీమ్ ను ఆశీర్వదించండి’ అన్నారు.
 
ఈ కార్యక్రమంలో విలన్ గా నటించిన శశి, రచయిత సురేష్, బట్టు అంజిరెడ్డి, జిట్టా సురేందర్ రెడ్డి, దండెం రాజశేఖర్ రెడ్డి, ప్రముఖ దర్శకుడు వెంకీ(కబడ్డీ కబడ్డీ) తదితరులు పాల్గొన్నారు.