సంబంధిత వార్తలు
- శాంసంగ్ వాలెట్లో డిజిటల్ పేమెంట్లు, యూపీఐ ఆన్‌బోర్డింగ్‌కు కొత్త రూపు
- ఆదిలాబాద్‌లో విమానాశ్రయ అభివృద్ధి: 700 ఎకరాల భూమికి ఆమోదం
- AI vs Indian Intelligence, అపార్టుమెంట్ గృహ ప్రవేశానికి గోవుకి బదులు గోవు మరబొమ్మ (video)
- వరల్డ్ కప్ గెలుచుకున్న ఆ క్షణాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాం.. నారా బ్రాహ్మణి (video)
- హర్మన్ ప్రీత్ కౌర్, జెమియాల అద్భుతమైన క్షణం.. హర్మన్‌ప్రీత్‌ను ఎత్తుకున్న తండ్రి- వీడియో వైరల్
చొక్కాపై చట్నీ వేసాడని అర్థరాత్రి కారులో తిప్పుతూ సిగరెట్లుతో కాల్చుతూ కత్తితో పొడిచి చంపేసారు
చిన్న కారణం. ఆ కారణంతో కొందరు ఉన్మాదంతో మరో యువకుడి ప్రాణాలను తీసారు. పోలీసులు వెల్లడించిన పూర్తి వివరాలు ఇలా వున్నాయి. హైదరాబాదులోని ఎల్బీ నగర్ దగ్గర ఉప్పల్ ప్రాంతానికి చెందిన మురళి అనే కుర్రాడు కారులో వెళ్తున్న యువకులను లిఫ్ట్ అడిగాడు. అలా కొంతదూరం ప్రయాణించాక ఎన్జీఆర్ఐ దగ్గర అల్పాహారం తినేందుకు కారు ఆపారు. అక్కడ అంతా కలిసి టిఫిన్ చేస్తుండగా ఒక యువకుడిపై పొరబాటున చట్నీ పడింది. దాంతో లిఫ్ట్ ఇచ్చిన తమ మీదే చట్నీ వేస్తావా అంటూ యువకుడు మురళిపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు.
ఆ తర్వాత అతడిని కారులోనే తిప్పుతూ సిగరెట్లతో కాల్చుతూ హింసించారు. వారి దాడి నుంచి తప్పించుకునేందుకు బాధితుడు కారు దిగి పరుగులు పెట్టాడు. అప్పటికీ వదలని ఆ ఉన్మాదులు అతడిని వెంబడించారు. అత్యంత దారుణంగా కత్తితో పొడిచి పొడిచి చంపేసారు. అతడు చనిపోయాడని నిర్థారించుకున్న తర్వాత మారణాయుధాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.
మల్లాపూర్ కేఎల్ రెడ్డి నగర్ ప్రాంతంలో తమ కారును పార్క్ చేసి అక్కడ నుంచి పారిపోయారు. ఐతే వారి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారం చేసుకుని పోలీసులు 24 గంటల లోపే నలుగురుని పట్టుకున్నారు. వారిని అరెస్ట్ చేసి రిమాండుకు పంపారు.
