నేను నమ్మని దాన్ని ప్రజలకు చెప్పలేను, అలా రూ 150 కోట్లు వదిలేసిన పవన్ కల్యాణ్
డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏకంగా రూ. 150 కోట్లు వదులుకున్నారట. ఆయనకు వున్న విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి పలు కంపెనీలు ఆయనను తమ బ్రాండ్లను ప్రమోషన్ చేయాలని అభ్యర్థించారట. ఇందుకుగాను ఆయనకు సుమారు రూ. 150 కోట్ల మేర పారితోషికం ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ఐతే వాటన్నిటినీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సున్నితంగా తిరస్కరించారట.
తను నమ్మని విషయాన్ని ప్రజలకు చెప్పలేను, కనుక అలాంటి ప్రొడక్ట్స్ కోసం నేను ప్రకటనల్లో కనిపించలేను అంటూ సున్నితంగా తిరస్కరించారట. పవన్ కల్యాణ్ చెబితే ఆయన ఫ్యాన్స్ ఫాలో అవడం ఎలా వుంటుందో వేరే చెప్పక్కర్లేదు. కనుక పవన్ కల్యాణ్ తన ఫ్యాన్సును చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇక డిప్యూటీ సీఎం అయిన తర్వాత అభిమానులతో పాటు ప్రజల బాగోగుల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు.