శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 10 జులై 2021 (15:59 IST)

బిర్యానీతో ఎఫ్‌3 టీమ్‌కు విందు చేసిన అలీ

Ali f3 team
న‌టుడు అలీ సెట్లో వుంటే సంద‌డే సందడి. అలాంటి సందండి చేసే టీమ్‌తో క‌లిస్తే చెప్పేదేముంది. బిర్యానీ బాగా ఇష్టంగా తినే అలీ త‌న‌తోపాటు త‌న టీమ్‌కు ఈరోజు లంచ్ ఏర్పాటు చేశాడు. హైద‌రాబాద్‌లో ఎఫ్‌3 షూటింగ్ స్పాట్‌లో లంచ్ ను త‌న ఇంటినుంచి త‌యారుచేసి బిర్యానీ పెట్టాడు. ఈ సంద‌ర్బంగా ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి త‌దిత‌రులు త‌న సోష‌ల్‌మీడియాలో వివాహ‌భోజ‌నంబు అంటూ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. ఆలీ తన ఇంట్లో స్వయంగా తయారు చేసిన బిర్యానీ తమ కోసం తీసుకొచ్చి వడ్డించారని అనీల్ రావిపూడి, నిర్మాత శిరీష్‌, న‌టుడు మ‌ధు త‌దిత‌రులు పేర్కొన్నారు.
 
వెంకటేష్, వరుణ్ తేజ్ లతో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “ఎఫ్ 2” ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే. ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతో పెద్ద హిట్ చేసిన ఈ చిత్రం కి సీక్వెల్ గా తీసుకొస్తున్న చిత్రం “ఎఫ్ 3”. మరింత ఫన్ ఎలిమెంట్స్ తో ప్లాన్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు బ్యాలన్స్ షూట్ ని శరవేగంగా జరుపుకుంటుంది. తమన్నా, మెహ్రీన్ లు హీరోయిన్స్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే దిల్ రాజు – శిరీష్ లు నిర్మాణం వహిస్తున్నారు.