గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 జులై 2021 (10:19 IST)

'బాహుబలి-2' రికార్డును బ్రేక్ చేసిన అజిత్.. ఎలా..?

'బాహుబలి-2' రికార్డును కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ బ్రేక్ చేశాడు. గత కొన్నాళ్లుగా అజిత అభిమానులు సోషల్ మీడియా వేదికగా అజిత్ తాజాగా నటిస్తున్న 'వలిమై' ఫస్ట్ లుక్ కావాలంటూ హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే ఫేమస్ టికెట్ బుకింగ్ యాప్ సినిమాపై ఎంతమందికి ఇంటరెస్ట్ ఉందో తెలపాలంటూ సర్వే నిర్వహించింది. అందులో అజిత్ 'వాలిమై'. బాహుబలి 2, ఎవెంజర్స్: ఎండ్ గేమ్ రికార్డులను అధిగమించి సరికొత్త రికార్డును సృష్టించింది.
 
'వలిమై' బుక్‌మైషోలో 1.73 మిలియన్లకు పైగా ఇంటరెస్ట్‌లను సంపాదించింది. ఈ సంఖ్య ఎవెంజర్స్: ఎండ్ గేమ్, బాహుబలి 2 సంపాదించిన ఇంటరెస్ట్‌ల కన్నా ఎక్కువ కావడం విశేషం. ఎవెంజర్స్: ఎండ్ గేమ్ విడుదలకు ముందు 1.70 మిలియన్ ఇంటరెస్ట్ లను, బాహుబలి-2 1 మిలియన్ ఇంటరెస్ట్‌లను కలిగి ఉంది. ఇక 'వాలిమై' చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలకు ముందే అజిత్ అభిమానుల ద్వారా ఈ ఘనతను సాధించగలిగాడు. 
 
ఇప్పుడే ట్రెండ్ సెట్ చేస్తున్న అజిత్ అభిమానులు ఇక 'వలిమై' ఫస్ట్ లుక్ వచ్చిందంటే ఏ రేంజ్ లో రచ్చ చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాగా ఈ ఏడాది ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో 'వలిమై' ఒకటి. ఈ చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. ఆయన గతంలో 'నెర్కొండ పార్వై'తో అజిత్‌కు బ్లాక్ బస్టర్ అందించారు.