అనిల్ రావిపూడి రిలీజ్ చేసిన `కళాకార్` మోషన్ పోస్టర్
Kalakar motion poster
ఈ సినిమాలో రోహిత్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ మహేంద్ర వర్మగా కనిపించనున్నట్లు మోషన్‌పోస్టర్ ద్వారా రివీల్ చేశారు మేకర్స్. క్రియేటివ్‌గా మరియు స్టైలిష్ గా ఈ మోషన్ పోస్టర్‌కు సోషల్‌మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ ``ఇటీవల విడుదల చేసిన `కళాకార్` ఫస్ట్‌లుక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పోలీస్ ఆఫీసర్ గా చాలా ఫిట్‌గా ఉన్నావు అని నా ఫ్రెండ్స్, సన్నిహితులు ఫోన్ చేసి ప్రసంశించారు. ఇప్పుడు మా మూవీ మోషన్‌పోస్టర్‌ను అనిల్ రావిపూడిగారు రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. కచ్చితంగా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది`` అన్నారు.
చిత్ర నిర్మాత వెంకటరెడ్డి జాజాపురం మాట్లాడుతూ,సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా కమర్షియల్‌గా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది`` అన్నారు.
దర్శకుడు శ్రీను బందెల మాట్లాడుతూ - ``ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. త్వరలో టీజర్ విడుదలచేస్తాం అన్నారు.

