గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 20 జనవరి 2022 (18:53 IST)

నానితో క‌లిసి మీసం తిప్పుతున్న‌ చిరంజీవి ఎందుకంటే?

Chiru- nani
మెగాస్టార్ చిరంజీవి మీసం తిప్పేంత‌లా త‌న‌కు న‌చ్చిందంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు. తాజాగా నాని ఓ పోస్ట్ పెడుతూ, శ్యామ్‌ని ఎవరు ప్రేమిస్తారో ఊహించండి.. అం టూ పేర్కొన్నారు. ఆ వెంట‌నే చిరంజీవి శ్యామ్ సింగ‌రాయ్ చిత్రాన్ని తాను ప్రేమించాన‌ని ఇలా నానితో క‌లిసి మీసం తిప్పుతూ పోస్ట్ చేశాడు. క‌రోనా టైంలో శ్యామ్ సింగ‌రాయ్ థియేట‌ర్‌లో విడుద‌లైంది. అయితే ఎ.పి.లో ఆంక్ష‌ల మ‌ధ్య యాభైశాతం క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి. ఈ సంద‌ర్భంగా టిక్కెట్ల రేట్ల గురించి నాని అన్న మాట‌లు పెద్ద వైర‌ల్ అయ్యాయి. ప్ర‌స్తుతం ఈ సినిమా ఓటీటీలో విడుద‌లైంది. 
 
ఈ చిత్రాన్ని వీక్షించిన ల‌నంత‌రం మెగాస్టార్ చిరంజీవి ఇలా నానితో క‌లిసి ఫోజ్ ఇచ్చారు. మెగాస్టార్ ఇలా స్పందించ‌డం ప‌ట్ల నాని ఫిదా అయిపోయాడు. నేను ఇంత‌కుముందు చెప్పిన‌ట్లుగానే క్రిస్మ‌న్ నాదే అని అన్న‌ట్లుగానే ప్రేక్ష‌కులు ఆద‌రించార‌ని తెలిపారు. శ్యామ్‌ సింగరాయ్ కలకత్తా నేపథ్యంలో పిరియాడికల్ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామా. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మించారు.సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలుగా నటించారు.