శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (10:11 IST)

#NightingaleOfIndia లతా మంగేష్కర్ ఇకలేరు - కరోనా - న్యూమోనియాతో మృతి

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కన్నుమూశారు. గత నెలలో ఆమెకు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ వచ్చారు. ఈ క్రమంలో ఆమె న్యూమోనియా బారినపడ్డారు. దీంతో ఆమెను ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తూ వచ్చారు. 
 
అయితే, శనివారం రాత్రి అత్యంత విషమంగా మారిన ఆమె ఆరోగ్యం ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమెకు వయసు 92 యేళ్లు. గత 2019లో శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ లతా మంగేష్కర్ ఆస్పత్రిలో చేరి, కోలుకున్న విషయం తెల్సిందే. 
 
ఆమె భారత ప్రభుత్వం నుంచి అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు. లంతా మంగేష్కర్ భారతీయ సంగీతానికి చేసిన సేవలకు గాను తొలిసారి 1969లో "పద్మభూషణ్" పురస్కారంతో సత్కరించింది. ఆ ర్వాత 1999లో "పద్మ విభూషణ్" అవార్డును ఇచ్చింది. 
 
2001లో భారత అతున్నత పౌర పురస్కారమైన "భారతరత్న"ను అప్పటి  రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ చేతుల మీదుగా లతా మంగేష్కర్‌కు ఇచ్చారు. అలాగే, 1989లో "దాదా సాహెహ్ ఫాల్కే" అవార్డును కూడా అందుకున్నారు. ఇవే కాకుండా ఫ్రాన్స్ ప్రభుత్వం ఇచ్చే "లీజియన్ ఆఫ్ హానర్" పురస్కారం కూడా పొందారు.