బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (10:44 IST)

"ఇండియా నైటింగేల్" లతా మంగేష్కర్ మృతిపట్ల ప్రధాని మోడీ సంతాపం

"నైటింగేల్ ఆఫ్ ఇండియా" లతా మంగేష్కర్ ఇకలేరు. గత కొద్ది రోజులుగా కరోనా, న్యూమోనియాతో బాధపడుతూ ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆమె ఆదివారం ఉదయం కన్నుమూశారు. 92 యేళ్ల లతా మగేష్కర్ ఆరోగ్యం శనివారం రాత్రి నుంచే విషమంగా మారడంతో ఆదివారం ఉదయం కన్నుమూశారు. 
 
ఇదిలావుంటే, 92 యేళ్ల లతా మంగేష్కర్ 7 దశాబ్దాలకు పైగా భారతీయ సంగీతానికి ఆమె చేసిన కృషి అద్భుతం. లతా మంగేష్కర్ తన గాన జీవితంలో అనేక అవార్డులను గెలుచుకున్నారు. ఆమెకు గత 2001లో భారతరత్న, 1999లో పద్మ విభూషణ్, 1989లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులను గెలుచుకున్నారు. 
 
కాగా, లంతా మంగేష్కర్ మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. ఆమె మృతివార్త తెలిసిన వెంటనే ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. "నేను చెప్పలేనంత వేదనలో ఉన్నాను. దయ, శ్రద్ధ గల లతా దీదీ మమ్మల్ని విడిచిపెట్టారు. ఆమె మన దేశంలో పూరించలేని శూన్యాన్ని మిగిల్చారు. రాబోయే తరాలు ఆమెను భారతీయ సంస్కృతికి మారుపేరుగా గుర్తుంటుంది. ఆమె మధురమైన స్వరం ప్రజలను మంత్రముగ్ధులను చేసింది. లతా దీదీ పాటలు రకరకాల భావోద్వేగాలను తీసుకొచ్చాయి. 
 
ఆమె దశాబ్దాలుగా భారతీయ చలనచిత్ర ప్రపంచం మార్పులను చూసింది. సినిమాలకు అతీతంగా ఆమె భారతదేశం అభివృద్ధిపై ఎల్లపుడూ మక్కువ చూపేవారు. ఆమె బలమైన, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని చూడాలని కోరుకుంది. లతా దీదీ నుంచి నేను అపారమైన ప్రమేము పొందడం నా గౌరవంగా భావిస్తున్నాను. ఆమెతో నా పరిచయం మురవలేనిది. లతా దీదీ మరణం నాకు బాధ కలిగించింది. ఓం శాంతి" అంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.