శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 జనవరి 2022 (08:52 IST)

ప్రధాని నరేంద్ర మోడీని చంపగలను : మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్

తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చంపగలను, దూషించగలను అంటూ మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ నానా పటోలే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 
 
మహారాష్ట్రలో జిల్లా, పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా తన సొంత నియోజకవర్గమైన భండారా జిల్లాలోని లఖానీ తెహసీల్‌లోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన ర్యాలీల్లో ఆయన పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను గత మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నానని, సొంత నిధులతో ఎన్నో పాఠశాలలకు భవనాలు నిర్మించానని గుర్తు చేశారు. కానీ, ఒక్కదానికి కూడా తన పేరు లేదన్నారు. ప్రతి ఒక్కరికీ సాయం చేస్తున్నానని చెప్పారు. 
 
పైగా తాను ప్రధాని మోడీని చంపగలను, దూషించగలనని అన్నారు. అందుకే ప్రధాని మోడీ తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిజాయతీ కలిగిన నాయకత్వానికి ఓటర్లు పట్టం కట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.