శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 జనవరి 2022 (14:42 IST)

భోగి వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్ దంపతులు

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాల్లో భాగంగా శుక్రవారం భోగి పండుగ జరుగుతుంది. దీంతో రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొనివుంది. అయితే, భోగి పండుగ వేడుకల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతీ రెడ్డిలు పాల్గొన్నారు. తాడేపల్లిలోని తన నివాసంలో జరిగిన వేడుకల్లో సీఎం దంపతులు పాల్గొన్నారు. అలాగే, తెలుగు ప్రజలందరికీ ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. 
 
ఇదిలావుంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. "అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక పండుగ మన సమాజంలో ఆనందమయ స్ఫూర్తిని పెంపొందించాలని, ప్రజలందరికీ మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం నేను ప్రార్థిస్తున్నాను" అంటూ ట్విట్టర్ ఖాతాలో శుభాకాంక్షలు తెలిపారు. 
 
అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. "మకరరాశిలోకి సూర్యుని ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలమని, ప్రజలు సిరి సంపదలతో భోగ భాగ్యాలతో తులతూగాలని ఆకాంక్షిస్తున్నట్టు" పేర్కొన్నారు.