1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 జనవరి 2022 (15:01 IST)

ఏపీ సీఎం జగన్‌కు అనుకూలంగా తీర్పు

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కోర్టులో ఊరట కలిగింది. ఆయనకు అనుకూలంగా కోర్టు తీర్పు ఒకటి వెలువడింది. సాక్షి పత్రికను నడిపిస్తున్న జగతి పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పెట్టిన పెట్టుబడుల కేసులో వైఎస్. జగన్, జగతిలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలకు భారీ ఊరట కలిగించేలా ఆదాయన్న పన్ను శాఖ అప్పీలెట్ ట్రైబునల్ తీర్పును వెలువరించింది. 
 
జగతి పబ్లికేషన్‌‍లో వివిధ కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులకు క్విడ్ ప్రోకోగా చూడలేమంటూ అప్పీలేట్ ట్రేబ్యునల్ తేల్చిచెప్పింది. జగన్మోహన్ రెడ్డి ఆయనకు చెందిన కంపెనీలపై సీబీఐ దాఖలు చేసిన 11 చార్జిషీట్లో చాలా ముఖ్యమైన కేసుల్లో సాక్షి పెట్టుబడుల కేసు ఒకటి. దీంతో ఆయనకు పెద్ద ఊరట లభించినట్టయింది.