శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 జనవరి 2022 (15:58 IST)

ప్రధాని మోడీ లక్ష్యంగా ఉగ్రవాదులు - నిఘా వర్గాల హెచ్చరిక

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు మరికొంతమంది రాజకీయ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడులు జరుగొచ్చని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ముఖ్యంగా, ఈ నెల 26వ తేదీన జరుగనున్న గణతంత్ర వేడుకల సందర్భంగా ఈ దాడులు జరుగొచ్చని హెచ్చరించాయి. 
 
ముఖ్యంగా, ఈ 75వ గణతంత్ర వేడుకలకు ఆసియా దేశాలైన కజికిస్థాన్, కర్గిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాధినేతలు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ క్రమంలో ఆప్ఘనిస్థాన్‌ సరిహద్దుల నుంచి ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు సమాచారం అందించాయి. 
 
దేశ రాజధాని ఢిల్లీతో సహా పంజాబ్, ఇతర నగరాల్లో ఈ దాడులు జరగొచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ దాడులు ప్రధానంగా రద్దీ ప్రాంతాలు, మార్కెట్లు, కీలకమైన కట్టడాలే లక్ష్యంగా దాడులు జరుగవచ్చని పేర్కొన్నాయి.