గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (11:30 IST)

ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన ఏపీ సీఎం జగన్

పీఎస్ఎల్వీ సీ-52 ఉపగ్రహాన్ని నిర్ధిష్ట కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. సోమవారం ఉదయం శ్రీహరికోటలోని షార్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ52 రాకెట్‌ను నింగిలోకి ప్రయోగించగా, అది విజయవంతమైంది. దీనిపై సీఎం జగన్ స్పందించారు. 
 
అగ్రదేశాలకు ధీటుగా భారత్‌ను నిలపడంలో ఇస్రో కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల స్థాయిలో భారతదేశ అంతరిక్ష పరిశోధన సామర్థ్యాలను ఇస్రో మరింత ఇనుమడింపజేసిందని సీఎం జగన్ కొనియాడారు. ఇస్రో ఇకపై కూడా ప్రతి ప్రయోగంలోనూ విజయంవంతంగా కావాలని ఆయన ఆకాంక్షించారు. 
 
పీఎస్ఎల్వీ సీ-52 ప్రయోగం విజయవంతం  
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన పీఎస్ఎల్వీ సీ52 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగం సోమవారం ఉదయం 5.59 గంటలకు పీఎస్ఎల్వీ సీ-52ను నింగిలోకి దూసుకెళ్ళింది. ఇందుకోసం ఆదివారం తెల్లవారుజామున 4.29 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించిన విషయం తెల్సిందే. ఇందులో మొత్తం మూడు ఉపగ్రహాలను నింగిలోకి పంపించింది. 
 
ఆదివారం తెల్లవారుజామున ప్రారంభమైన ఈ కౌంట‌డౌన్ మొత్తం 25 గంటల 30 నిమిషాల పాటు కొనసాగింది. ఈ ప్రయోగ ప్రక్రియను ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్ స్వయంగా పర్యవేక్షించారు. ఇందులో ఐఆర్ శాట్ 1 ఏ, ఐఎన్ఎస్ 2టీడీ, విద్యార్థులు తయారు చేసిన ఇన్‌స్పైర్ శాట్ 1 ఉపగ్రహాలు ఉన్నాయి. మరోవైపు, ఈ యేడాది మరిన్ని ప్రయోగాలను చేపట్టేందుకు ఇస్రో సిద్ధమవుతుంది. 
 
ఈ ప్రయోగం ద్వారా కక్ష్యలోకి రి శాట్‌తో పాటు ఇన్‌స్పైర్, ఐఎన్ఎస్ 2టీడీ ఉపగ్రహాలను రాకెట్ ద్వారా కక్ష్యలోకి పంపించింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో ఛైర్మన్ హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే పీఎస్ఎల్వీ సీ53 ప్రయోగాన్ని చేపట్టనున్నట్టు ఆయన వెల్లడించారు. 
 
వ్యవసాయం, సాగు, అటవీ నీటి వనరులు సమాచారం కోసం ఆర్ ఐశాట్ 1 ఉపగ్రహం భారత్, భూటాన్ దేశాలు కలిసి సంయుక్తంగా రూపొందించిన ఉపగ్రహమే ఐఎన్ఎస్ 2టీడీ అని ఆయన వివరించారు.