గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 జనవరి 2022 (13:44 IST)

శ్రీహరికోట షార్‌లో కరోనా కలకలం... ఒకే రోజు 142 పాజటివ్ కేసులు

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన ఉపగ్రహ ప్రయోగ కేంద్రం షార్ సెంటరులో పని చేసే ఉద్యోగులపై కరోనా వైరస్ విరుచుకుపడింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఉన్న ఈ అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. ఒకే రోజు ఏకంగా 142 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో ఉద్యోగులతో పాటు ఉన్నతాధికారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 
 
మంగళవారం ఏకంగా 91 మందికి ఉద్యోగులకు ఈ వైరస్ సోకింది. సంక్రాంతి సెలవులకు ఊర్లకు వెళ్లి వస్తున్న వారికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, అనేక కేసులు బయటపడుతున్నాయి. ఇప్పటికే 50 శాతం మంది ఉద్యోగులతో షార్ కేంద్రం పని చేస్తుంది. 
 
ఇపుడు అనేక మంది ఈ వైరస్‌ కోరల్లో చిక్కుకున్నారు. ఒకే రోజులో 142 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో మిగిలిన ఉద్యోగులు సైతం ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి కోవిడ్ టెస్టులు చేస్తున్నారు.