సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 జనవరి 2022 (11:36 IST)

తగ్గుతున్న కరోనా - పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. అదేసమయంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా ,238,018 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం వెల్లడించిన కేసులతో పోల్చుకుంటే 20,017 కేసులు తక్కువ కావడం గమనార్హం. అదేసమయంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగాయి. ఇప్పటివరకు ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 8,891కు చేరాయి. 
 
ఇదే అంశంపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన మేరకు గత 24 గంటల్లో ఏకంగా 2,38,018 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, 310 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా 1,57,421 మంది కోలుకున్నారు. 
 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 17,36,628 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ కోవిడ్ పాజిటివిటీ రేటు 14.43 శాతంగా ఉంది. అలాగే, ఒమిక్రాన్ కేసుల పాజిటివిటీ రేటు కూడా 94.09 శాతంగా ఉంది.