గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 జనవరి 2022 (10:38 IST)

హాలీవుడ్‌ను షేక్ చేస్తున్న గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా

భారతీయ నటి ప్రియాంకా చోప్రా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు ఆమె ముఖ చిత్రాన్ని దాదాపు 30కి పైగా అంతర్జాతీయ మ్యాగజైన్ కవర్ పేజీలపై ముద్రించారు. ఇలా ముద్రించిన తొలి భారతీయ నటిగా ప్రియాంకా చోప్రా రికార్డుపుటలకెక్కారు. 
 
అల్లూరే, మరియా క్లైయిర్, ఎల్లే, వోగ్యు, మాక్సిమా, ఇన్‌స్టైల్, కాస్మోపాలిటన్, కాంప్లెక్స్ ఇలా దాదాపు 30 గ్లోబల్ మ్యాగజైన్లు ప్రియాంకా చోప్రా ముఖ చిత్రాన్ని తమ కవర్ పేజీకి వాడుకున్నాయి. తాజాగా వానిటీ ఫెయిర్ అనే మ్యాగజైన్ కూడా ఈ ఫోటోను ముద్రించింది. 
 
ఈ ఫోటో కింద "హాలీవుడ్‌ను షేక్ చేస్తున్న గ్లోబల్ స్టార్. స్టీరియోటైప్‌లను బద్ధలు కొడుతూ నిక్ జోనాస్‌తో సెటిల్ అయింది" అంటూ ప్రింట్ చేశారు. మొత్తంమీద అమెరికా పాప్ సింగర్‌ను వివాహం చేసుకున్న ప్రియాంకా చోప్రా... హాలీవుడ్ వేదికపై తన సత్తా చాటుతున్నారు.