గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 జనవరి 2022 (09:02 IST)

సోషల్‌ మీడియాకు అంత ఇంపార్టెన్సా.. అబ్బే ఇదేం బాగోలేదు...?

సామాజిక మాధ్యమాల ఖాతాల్లో తన భర్త నిక్‌జొనాస్‌ పేరు తొలగించటంతో ప్రియాంక చోప్రా విడాకులు తీసుకుంటుందంటూ వార్తలొచ్చాయి. ఆ రూమర్స్‌‌పై  ప్రియాంకా చోప్రా స్పందించింది. ప్రముఖ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలా ఎందుకు జరిగిందో వివరించారు. వృత్తిపరమైన కారణాల వల్ల తన భర్త పేరును తొలగించాల్సి వచ్చిందని తెలిపారు. 
 
జరిగింది ఒకటైతే కొందరు సోషల్‌ మీడియా వేదికగా మరో రకంగా చిత్రీకరిస్తారని చెప్పుకొచ్చింది. చాలామంది తమ జీవితంలో సోషల్‌ మీడియాకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని, అది అంత మంచిది కాదని అభిప్రాయపడింది. 
 
ఏదైనా ఫొటోను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటే ఏవేవో ఊహించుకుంటుంటారని వెల్లడించింది. ప్రియాంక చోప్రా తన భర్త పేరును తీసేయటం గతేడాది నవంబరులో హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే.