కుర్రకారుపై మనసు పారేసుకుంటున్న ముదురు హీరోయిన్లు.. కారణం?
ఇటీవలి కాలంలో అనేకమంది ముదురు హీరోయిన్లు కుర్రకారు హీరోయిలను పెళ్లి చేసుకుంటున్నారు. ఈ పరిస్థితి హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు కొనసాగుతోంది. గతంలో బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా తన కంటే వయసులో పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ను పెళ్ళి చేసుకుంది.
అలాగే, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ కూడా 90లో ఎంతో మంది కుర్రాళ్ళను ప్రేమలో పడేసింది. మిస్ యూనివర్స్‌గా కలలరాణిగా మారింది. ఈమె కూడా తన కంటే 15 యేళ్ళ చిన్నవాడైన మోడల్ రోహమాన్ షాల్‌కి పడిపోయింది. వీరిద్దరూ లివింగ్ రిలేషన్‌లో కొనసాగుతున్నారు.
అలాగే, ఐటమ్ బాంబ్ మలైకా అరోరా కూడా ఇదే పని చేసింది. తన భర్త అర్ఫాజ్ ఖాన్‌కి విడాకులు ఇచ్చి తన కంటే చిన్నవాడైన బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్‌తో రిలేషన్‌లో ఉంది. మలైకా కంటే అర్జున్ 12 యేళ్లు చిన్నవాడు.
అదేవిధంగా డస్కీ బ్యూటీ బిపాసా బసు తన కంటే నాలుగేళ్ల చిన్నోడైన కరణ్ సింగ్ గ్రోవర్‌తో ఏడగులు వేసింది. ఇపుడు బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కూడా ఇదే పనిచేసింది. ఈమెకూడా తన కంటే వయసులో చిన్నవాడైన హీరో విక్కీ కౌశల్‌ను తాజాగా పెళ్లి చేసుకుని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచారు.