ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 డిశెంబరు 2021 (22:42 IST)

కత్రినా కైఫ్ పెళ్లికి సల్మాన్ ఖానా? ఛాన్సేలేదు..?

బాలీవుడ్ కత్తి కత్రినా కైఫ్, విక్కీ కౌషల్ వివాహం త్వరలో జరుగనుంది. ఈ వివాహానికి సినీ ప్రముఖులు హాజరవుతున్నారు. ఇప్పటికే శుభలేఖలు పంపిణి చేయడం జరిగిపోయింది. 
 
అదే కోవలో మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్, అతడి సోదరీమణులకూ ఇన్విటేషన్ పంపారన్న వార్తలు బిటౌన్‌లో చక్కర్లు కొట్టాయి. అయితే, ఆ వార్తలపై సల్మాన్ గారాల చెల్లెలు అర్పితా ఖాన్ క్లారిటీ ఇచ్చేసింది. కత్రినా కైఫ్ నుంచి తమకు ఎలాంటి ఆహ్వాన పత్రిక అందలేదని స్పష్టం చేసింది.
 
అలాగే కత్రినా అంటే సల్మాన్‌కు అభిమానమని.. ఆమెకు శుభాకాంక్షలు తెలిపాడని వెల్లడించింది. వివాహానంతరం టైగర్ 3 షూటింగ్‌లో సల్మాన్‌తో జత కడుతుందని చెప్పింది. 
 
అలాగే సల్మాన్ ఫ్యామిలీకి కత్రినా దగ్గర్నుంచి ఎలాంటి ఆహ్వానాలూ రాలేదని కుటుంబానికి చెందిన అత్యంత సన్నిహితులు చెబుతున్నారు. సల్మాన్ కుగానీ, అర్పిత, అల్విరాలకుగానీ ఇన్విటేషన్ రాలేదన్నారు. కత్రిన పెళ్లికి హాజరవుతారన్న వార్తల్లో నిజం లేదని చెప్పారు.