గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 24 నవంబరు 2021 (20:02 IST)

నా నియోజకవర్గంలో రోడ్లు కత్రినా కైఫ్ చెంపల్లా మెరిసిపోవాలి...

రాజస్థాన్ రాష్ట్ర మంత్రివర్గంలో ఇటీవల చోటు దక్కించుకున్న మంత్రి రాజేంద్ర సింగ్. ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారో లేదాగానీ అపుడే వివాదంలో చిక్కుకున్నారు. తన సొంత నియోజకవర్గంలో వేసే రోడ్లు బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ చెంపల్లా తళతళ మెరిసిపోవాలంటూ కామెట్స్ చేశారు. ఇపుడు ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 
 
ఆయన మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న తర్వాత మంగళవారం తన సొంత నియోజకవర్గంలో పర్యటించారు. ఇందులోభాగంగా ఉదయ్‌పూర్వతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో తన అనుచరులు, స్థానికులతో మాట్లాడారు. అపుడు అనేక సమస్యలను స్థానికులు ఏకరవు పెట్టారు.
 
వీటిపై మంత్రి స్పందించారు. అక్కడే ఉన్న ప్రజాపనుల శాఖ ముఖ్య ఇంజనీర్‌ను ఉద్దేశించి.. తన నియోజకవర్గంలో వేసే రోడ్లు కత్రినా కైఫ్ చెంపల్లా మెరిసిపోవాలంటూ వ్యాఖ్యానించారు. దీంతో సమావేశంలో ఒక్కసారి నవ్వులు పూశాయి. దీంతో మంత్రివర్యులు మరింత రెట్టింపు ఉత్సాహంతో ఇదే వ్యాఖ్యలు చేశారు.