సంబంధిత వార్తలు
- స్కూల్ విద్యార్థులకు బ్యాడ్ న్యూస్... పొడగించే ప్రసక్తే లేదట...
- అంబటి రాంబాబుకు ముచ్చటగా మూడోసారి కరోనా పాజిటివ్
- కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు.. నీట మునిగిన గ్రామాలు
- ఆంధ్రప్రదేశ్: కాకినాడ బీచ్లో పల్లీలు అమ్ముకునే వ్యక్తి కోసం 12 ఏళ్లు వెతికిన ఎన్ఆర్ఐ కుటుంబం... అసలేం జరిగింది?
- ఆంధ్రప్రదేశ్: 'గుడిసె' ఉన్నట్లుండి సినిమా షూటింగ్ స్పాట్ ఎలా అయింది?
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 4,570 కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 4,570 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 30,022మంది వద్ద శాంపిల్స్ సేకరించి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో 4,570 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,124 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
అలాగే, విశాఖలో 1,028, గంటూరులో 368, అనంతపురంలో 347 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదేసమయంలో ఈ వైరస్ నుంచి 669 మంది కోలుకున్నారు. చిత్తూరు జిల్లాలో ఓ కరోనా రోగి ప్రాణాలు కోల్పోయారు.
స్కూల్ విద్యార్థులకు బ్యాడ్ న్యూస్...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు ఆ రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ బ్యాడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువైపోతోంది. దీంతో పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో అన్ని విద్యా సంస్థలకు ఈ నెలాఖరు వరకు సెలవులు ప్రకటించారు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
ఇదే అంశంపై మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దీంతో సోమవారం నుంచి స్కూల్స్ తెరుచుకుంటాయని చెప్పారు. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు స్కూల్స్ సెలవులు పొడగించవచ్చన్న వార్తలు వస్తున్నాయి. వీటిలో ఏమాత్రం నిజంలేదు. యధావిధిగా సోమవారం నుంచి స్కూల్స్ తెరుచుకుంటాయని తెలిపారు.
