1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. YSRCP MLA Ambati Rambabu Tests COVID Positive

అంబటి రాంబాబుకు ముచ్చటగా మూడోసారి కరోనా పాజిటివ్

Ambati Rambabu
గుంటూరు జిల్లా సత్తెనపల్లి శాసనసభ్యుడు, వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబుకు ముచ్చటగా మూడోసారి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన ఓ సెల్ఫీ వీడియో ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తనకు స్వల్ప కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని, అందువల్ల తనతో కాంటాక్ట్ అయినవారంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. 
 
కాగా, ఇటీవల సత్తెనపల్లిలో జరిగిన భోగి పండుగ సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు గిరిజన మహిళలతో కలిసి సంప్రదాయం నృత్యం చేశారు. ఈ భోగి వేడుకల్లో అనేక మంది పాల్గొన్నారు. వీరిలో ఏ ఒక్కరు కూడా ముఖానికి మాస్క్ ధరించిన పాపానపోలేదు. 
 
ఇలాంటివారిలో బాధ్యతాయుతమైన ప్రజా ప్రతినిధిగా ఉన్న అంబటి రాంబాబు కూడా ఉన్నారు. ఫలితంగా ఆయన కరోనా వైరస్ బారినపడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈయన హోం క్వారంటైన్‌లో ఉన్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
స్కూల్ విద్యార్థులకు బ్యాడ్ న్యూస్... పొడగించే ప్రసక్తే లేదట...