OG2 : తుఫాను రాకముందు.. ఒక నిశ్శబ్ద క్షణం అంటూ.. ఓజీ 2 అప్ డేట్
Updated: Thu, 25 Jun 2026 (19:36 IST)
OG 2 releve poster pawan, sujit
గంభీర'కు సంబంధించిన చెప్పబడని కథ ఆవిష్కృతమయ్యే సమయం ఆసన్నమైంది. ఓజీ యూనివర్శ్ గాథను విస్తరించేందుకు, 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్బ్యా నర్‌పై దర్శకుడు సుజీత్, పవన్ కళ్యాణ్ మరోసారి సిద్ధమవుతున్నారు. ఓజీలో థమన్ సంగీతం ఎంత పేరు తెచ్చిందే తెలిసిందే. అదే పేరుతో థమన్ మ్యూజిక్ సెలబ్రేషన్ కూడా నిర్వహిస్తున్నారు.
ఇక గురువారంనాడు పవన్ కళ్యాణ్ టీమ్ ఓజీ 2 గురించి సోషల్ మీడియాలో ప్రకటన తెలియజేసింది. తాజాగా పవన్ కన్ఫమ్ చేశాడు. సుజిత్ కథ లీక్ చేశాడు.
పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ `ఓజీ` మూవీ. ఇది సుమారు మూడు వందల కోట్లు వసూలు చేసింది. దీనికి దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహించారు. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ గతేడాది విడుదలైన విషయం తెలిసిందే. అదిరిపోయే విజయాన్ని సాధించి పవన్ కళ్యాణ్‌కి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది. ఆయన రేంజ్ ఏంటో చూపించిందీ మూవీ. ఇప్పుడు దీనికి సీక్వెల్ పార్ట్ 2 రాబోతుంది.
దేవీ (మురళీకృష్ణ)
నిక్‌నేమ్- శక్తిమాన్
సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక......
మరింత చదవండి