మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 జనవరి 2022 (10:42 IST)

దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఉధృతి - 2.60 లక్షల కేసులు

దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రభావం తారాస్థాయికి చేరింది. ఫలితంగా ప్రతి రోజూ లక్షల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా ఏకంగా 2,58,089 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, కోవిడ్ బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారిలో 385 మంది ఉన్నారు. ఈ వైరస్ నుంచి మరో 1,51,740 మంది విముక్తి పొందారు. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 16,56,341 యాక్టివ్ కేసులు ఉండగా, వీరంతా వివిధ ఆస్పత్రులు హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారు. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 119.65 శాతానికి పెరిగింది.
 
మరోవైపు, ఒమిక్రాన్ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. ఇప్పటివరకు 8,209 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 70.37 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, గడిచిన 24 గంటల్లో ఏకంగా 13,13,444 మందికి ఈ పరీక్షలు చేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది.