గగన్‌యాన్ మళ్లీ ట్రాక్‌లోకి : ఇస్రో ఛైర్మన్ సోమనాథ్
భారతదేశపు తొలి మానవ సహిత మిషన్ గగన్‌యాన్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ, కోవిడ్, ఇతర పరిమితుల కారణంగా గగన్‌యాన్ టైమ్‌లైన్‌లో ఆలస్యం జరిగింది. అయితే, ఈ విషాలు మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాయి. మొదటి మానవరహిత మిషన్‌కు అవసరమైన అన్ని వ్యవస్థలు ఉన్నాయని తెలిపారు.
ఇస్రో 2022లో గగన్‌యాన్ కింద మొదటి అన్‌క్రూడ్ మిషన్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది. దాని తర్వాత రెండో మానవరహిత మిషన్ వ్యోమ్మిత్ర రోబోట్‌ను తీసుకెలుతుంది.
దీనిద్వారా మనుషులతో కూడిన మిషన్ ఉంటుంది ఎంపికైన భారతీయ వ్యోమగాములు రష్యాలో జెనరిక్ స్పేస్ ఫ్లైట్ శిక్షణను విజయవంతంగా పొందారని, బెంగుళూరులో తాత్కాలిక వ్యోమగామి శిక్షణా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు ఇస్రో ఛైర్మన్ వెల్లడించారు. గగన్ యాన్ 2023లో ప్రయోగించే అవకాశం ఉందని తెలిపారు.