సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : శనివారం, 28 ఆగస్టు 2021 (13:09 IST)

ఇస్రో ప్రయివేటీకరణ ప్రక్రియ ప్రారంభం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)ను మోడీ ప్రభుత్వం ప్రయివేటీకరిస్తోంది. ఇందుకోసం తొలుత పోలార్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్స్‌ (పిఎస్‌ఎల్‌వి) తయారీ ప్రక్రియను కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించడానికి ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటి వరకు అంతరిక్ష పరిశోధనలను ఇస్రో స్వయంగా నిర్వహిస్తూ వస్తోంది.

కేంద్రం పిఎస్‌ఎల్‌వి తయారీ పనులను అతి త్వరలోనే కార్పొరేట్లకు అప్పగించనుంది. పిఎస్‌ఎల్‌వి తయారీ కాంట్రాక్టును పొందడానికి అదానీ గ్రూపు, ఎల్‌అండ్‌టి గ్రూపు లాంటి బడా కార్పొరేట్లు పోటీ పడుతున్నాయి.

ఈ రెండు సంస్థలు వేరు వేరు కన్సారియంలుగా ఏర్పాడి ఆసక్తి బిడ్లను దాఖలు చేశాయి. వీటితో పాటుగా ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌(భెల్‌) ఏకైకా కంపెనీగా బిడ్స్‌ను దాఖలు చేసింది.

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా పిఎస్‌ఎల్‌వి కాంట్రాక్టును పొందడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఎల్‌అండ్‌టి సారధ్యంలోని కన్సార్టియంలో హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ ఉందని సమాచారం.