గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 28 జులై 2021 (22:34 IST)

వచ్చే ఏడాది చంద్రయాన్-3 ప్రాజెక్ట్ ప్రారంభం: ఇస్రో

చంద్రయాన్‌ -3 వచ్చే ఏడాది మూడో త్రైమాసికంలో ప్రారంభం కావచ్చని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ బుధవారం ప్రకటించారు. చంద్రునిపై భారత్‌ ప్రయోగిస్తున్న ఈ ప్రయోగం కరోనా మహమ్మారికి కారణంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే.

చంద్రయాన్‌ రీషెడ్యూల్‌ చేయబడిందని లోక్‌సభలో జితేంద్ర సింగ్‌ లిఖిత పూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ప్రస్తుతం చంద్రయాన్‌ ప్రాజెక్ట్‌ వేగవంతం కావచ్చని అన్నారు. లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటికీ సాధ్యమైనంత వరకు పనులు చేపట్టారని.. త్వరలో ప్రయోగించవచ్చని చెప్పారు.

కాగా, చంద్రుని కక్ష్యలోని దక్షిణ ధ్రువంలో దిగేందుకు చంద్రయాన్‌-2ను 2019 జులై 22న ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) కీలక ప్రాజెక్టని, భారతదేశ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించనుంది.